5, మార్చి 2012, సోమవారం

శ్రీ స్వామి శివానంద సరస్వతి కృత సర్వలింగ స్తవం

హర హర మహాదేవ శంభో శంకరా!

II శ్రీ స్వామి శివానంద సరస్వతి కృత సర్వలింగ స్తవం II

ఓ ఓంకారేశ్వర, ఉమామహేశ్వర,
రామేశ్వర, త్ర్యంబకేశ్వర, మహాబలేశ్వర
మహాకాళేశ్వర, ముక్తేశ్వర, ఓం నమశ్శివాయ II 1 II

ఓ జంబుకేశ్వర, కాళహస్తీశ్వర,
తారకేశ్వర, పరమేశ్వర,
నర్మదేశ్వర, నాగేశ్వర, మంజునాథేశ్వర, ఓం నమశ్శివాయ II 2 II

ఓ అర్ధనారీశ్వర, కపిలేశ్వర,
బృహదీశ్వర, భువనేశ్వర, కుమ్భేశ్వర,
వృద్ధాచలేశ్వర, ఏకాంబరేశ్వర, ఓం నమశ్శివాయ  II 3 II

ఓ కైలాసపతే, పశుపతే,
గౌరీపతే, పార్వతీపతే,
ఉమాపతే, శివకామిపతే ఓం నమశ్శివాయ II 4 II

ఓ విశ్వేశా, త్యాగేశా, సర్వేశా,
సుందరేశా, మహేశా, జగదీశా,
ఘృష్ణేశా, మాతృభూతేశా ఓం నమశ్శివాయ II 5 II

ఓ కైలాసనాథా, కాశీనాథా,
కేదారనాథా, ముక్తినాథా,
అమరనాథా, పశుపతినాథా ఓం నమశ్శివాయ II 6 II

ఓ కాశీ విశ్వనాథా, కాంచీనాథా,
సోమనాథా, వైద్యనాథా,
తుంగనాథా, త్రిలోకనాథా ఓం నమశ్శివాయ II 7 II

ఓ కాలభైరావా, త్రిపురాంతకా,
నీలలోహితా, హరో హర,
శివా, శంభో, శంకరా, సదాశివా ఓం నమశ్శివాయ II 8 II

ఓ మహాదేవా, మహాకాళా,
నీలకంఠా, నటరాజా, చంద్రశేఖరా,
చిదంబరేశా, పాపవిమోచకా ఓం నమశ్శివాయ II 9 II

ఓ హాలాస్యసుందరా, మీనాక్షీసుందరా,
కళ్యాణసుందరా, కదంబవనసుందరా,
శ్రీశైలవాసా, వీరభద్రా ఓం నమశ్శివాయ II 10 II

ఓ గౌరీశంకరా, గంగాధరా,
దక్షిణామూర్తే, మృత్యుంజయా,
ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమశ్శివాయ II 11 II

ఓ వైక్కటప్పా, తిరువోణిఅప్పా,
చిత్తాంబళా, పొన్నాంబళా,
చిత్సభేశా, చిదంబరేశా, ఓం నమశ్శివాయ II 12 II

ఓ కామదహనా, బ్రహ్మశిరస్ఛేదా,
కూర్మ-మత్స్య-వరాహ-స్వరూపా,
వీరభైరవా, వృషభారూఢా, ఓం నమశ్శివాయ II 13 II

ఓ కాలాంతకా, మల్లికార్జునా,
అరుణాచలా, నందివాహనా,
భిక్షాదానా, భక్తరక్షకా, ఓం నమశ్శివాయ II 14 II

ఓ భీమశంకరా, భస్మధారా,
పన్నగభూషణా, పినాకధారీ,
త్రిలోచనా, త్రిశూలపాణే, ఓం నమశ్శివాయ II 15 II

II ఇతి సర్వలింగ స్తవం సంపూర్ణం II 


సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి