31, ఆగస్టు 2012, శుక్రవారం

శ్రీ ఆర్యాద్విశతి – 4వ భాగము




II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 4 భాగము II 
(శ్రీ లలితాస్తవరత్నమ్) 
పవమాన సఙ్ఖ్య

యోజన దూరే బాలతృణ మేచక స్తస్య I
సాలో మరకత్ రచిత
స్సంపద మచలాం శ్రియం చ పుష్ణాతు II 61 II

ఆవృతి యుగ్మాన్తరతో
హరితమణీ నివహ మేచకే దేశే I
హాటక తాలీవిపినం
హాలాఘట ఘటిత విటప మాకలయే II 62 II

తత్రైవ మన్త్రిణీగృహ
పరిణాహం తరళకేతనం సదనమ్ I
మరకతసౌధ మనోజ్ఞం
దద్యా దాయూంషి దండనాథాయాః II 63 II

సదనే తత్ర హరిన్మణి
సఙ్ఘటితే మణ్టపే శత స్తమ్భే I
కా ర్తస్వర మయ పీఠే
కనకమయామ్బురుహ కర్ణికా మధ్యే II 64 II

బిన్దు-త్రికోణ-వర్తుల-
షడ్దళ-వృత్తద్వయాన్వితే చక్రే I
సఞ్చారిణీ దశో త్తర
శతార్ద మనురాజ కమల కలహంసీ II 65 II

కోల వదనా కుశేశ య
నయనా కోకారి మణ్డిత కిరీటా I
సన్తప్త కాఞ్చినాభా
సన్ధ్యారుణ చేల సంవృత నితమ్బా II 66 II

హల-ముసల-శఙ్ఖ-చక్రాఙ్కుశ-
పాశాయుధ స్ఫురిత హస్తా I
కూలఙ్కష కుచకుమ్భా
కుఙ్కుమజమ్బాలిత స్తనాభోగా II 67 II

ధూర్తానా మతిదూరా
వార్తా శేషావలగ్న కమనీయా I
ఆర్తాళీ శుభధాత్రీ
వార్తాళీ భవతు వాఞ్ఛితార్థాయ II 68 II

తస్యాః పరితో దేవీః
స్వప్నే శ్యున్మత్త భైరవీ ముఖ్యాః I
ప్రణమత జమ్భిన్యాద్యా
భైరవవర్గాంశ్చ హైతుక ప్రముఖాన్ II 69 II

పూర్వోక్త సఙ్ఖ్య యోజన
దూరే పూషాంశు పాటల స్తస్య I
విద్రావయతు మదార్తిం
విద్రుమసాలో విసఙ్కటద్వారః II 70 II

ఆవరణయో రహర్నిశ
మన్తర భూమౌ ప్రకాశ శాలిన్యామ్ I
ఆసీన మమ్బుజాసన
మభినవ సిన్దూర గౌర మహ మీడే II 71 II

వరణస్య తస్య మారుతి
యోజనతో విపుల గోపుర ద్వారః I
సాలో నానారత్నై
స్సఙ్ఘటితాఙ్గః కృషీష్ట మదభీష్టమ్ II 72 II

అన్తర కక్ష్యా మనయో
రవిదళ శోభా పిచణ్డిలోద్దేశామ్ I
మాణిక్య మణ్డపాఖ్యాం
మహతీ మధిహృదయ మనిశ మాకలయే II 73 II

తత్ర స్థితం ప్రసన్నం
తరుణ తమాల ప్రవాళ కిరణాభమ్ I
కర్ణావలమ్బి కుణ్డల
కన్దళితాభీశు కవచిత కపోలమ్ II 74 II

శోణాధరం శుచిస్మిత
మేణాఙ్క నిభాస్య మేధమాసకృపమ్ I
ముగ్ధైణమద విశేషక
ముద్రిత నిటలేన్దు రేఖికా రుచిరమ్ II 75 II

నాళీక దళ సహోదర
నయనాఞ్చల నటిత మనసిజాకూతమ్ I
కమలా కఠిన పయోధర
కస్తూరీ ఘుసృణ పఙ్కిలోరస్కమ్ II 76 II

చామ్పేయ గన్ధికైశ్యం –
శమ్పా సబ్రహ్మచారి కౌశేయమ్ I
శ్రీవత్స కౌస్తుభ ధరం
శ్రితజన రక్షా ధురీణ చరణాబ్జమ్ II 77 II

శమ్బు సుదర్శన విలసత్
కరపద్మం కణ్ఠ లోల వనమాలమ్ I
ముచుకున్ద మోక్షఫలదం
ముకున్ద మానన్ద కన్ద మాలమ్బే II 78 II

తద్వరణో త్తర భాగే
తారాపతి బిమ్బ చుమ్బి నిజ శృఙ్గః I
వివిధమణీ గణ ఖచితో
వితరతు సాలో వినిర్మలాం ధిషణామ్ II 79 II

ప్రాకార ద్వితీయా న్తర
కష్యాం-పృథు రత్న నికర సమ్పూర్ణామ్ I
నమత సహస్ర స్తమ్భక
మణ్టప నామ్నాతి విశ్రుతాం భువనే II 80 II
 

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

29, ఆగస్టు 2012, బుధవారం

శ్రీ ఆర్యాద్విశతి – 3వ భాగము

ఓం శ్రీశివకామసుందర్యై నమః
II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 3 భాగము II 
(శ్రీ లలితాస్తవరత్నమ్)


వప్రద్వయా న్తరోర్వ్యాం
వటుకై ర్వివిధైశ్చ యోగినీ బృన్దైః I
సతతం సమర్చితాయా
సఙ్కర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జమ్ II 41 II

తాపస యోజన దూరే
తస్య సముత్తుఙ్గ గోపురోపేతే I
వాఞ్ఛాపూర్త్యై భవతాద్
వజ్రమణీ నికర నిర్మితో వప్రః II 42 II

జవరణ ద్వితయా న్తరతో
వాసజుషో వివిధ మధురసాస్వాదాః I
రమ్భాది విబుధ వేశ్యా
రచయన్తు మహాన్త మస్మదానన్దమ్ II 43 II

తత్రసదా ప్రవహన్తీ
తటినీ వజ్రాభిధా చిరం జీయాత్ I
చటులోర్మి ఝాట నృత్యత్
కలహంసీ కుల కలక్వణిత హృష్టా II 44 II

రోధసి తస్యా రుచిరే
వజ్రేశీ జయతి వజ్ర భూషాఢ్యా I
వజ్ర ప్రదాన తోషిత
వజ్రిముఖ త్రిదశ వినుత చారిత్రా II 45 II

తస్యోదీచ్యాం హరితి
స్తబకిత సుషమావలీఢ వియదన్తః I
వైఢూర్య రత్న రచితో
వైమల్యం దిశతు చేతసో వరణః II 46 II

అధిమధ్య మేతయోర
ప్యమ్బా చరణాబ్జ లమ్బిత స్వాన్తాన్ I
కర్కోటకాది నాగాన్
కలయామః కిఞ్చి బలిముఖాన్ దనుజాన్ II 47 II

గన్ధవహ సఙ్ఖ్య యోజన
దూరే గగనాధ్వ జాఙ్ఘిక స్తస్య I
వాసవమణి ప్రణీతో
వరుణో బహుళయతు వైదుషీం విశదామ్ II 48 II

మధ్యక్షోణ్యా మముయో
ర్మాహేన్ద్ర నీలాత్మకాని చ సరాంసి I
శాతోదరీ సహాయాన్
భూపాలానపి పునః పునః ప్రణుమః II 49 II

ఆశుగ యోజన దూరే
తస్యోర్ధ్వం కాన్తి ధవళిత దిగన్తః I
ముక్త విరచిత గాత్రో
ముహురస్మాకం ముదే భవతు వప్రః II 50 II

అధివప్రద్వయ మధ్యం-
పూర్వాస్యాం దిశి పురన్దరః శ్రీమాన్ I
అభ్రమ విటాధిరూఢో
విభ్రమ మస్మాక మనిశ మాతనుతాత్ II 51 II

తత్కోణే వ్యజన – సృక్
తోమర-పాత్ర-స్రువాన్న-శక్తిధరః I
స్వాహా స్వధా సమేత
స్సుఖయతు మాం హవ్యవాహన స్సుచిరమ్ II 52 II

దక్షిణ దిగ న్తరాళే
దణ్డధరో నీల నీరద చ్ఛాయః I
త్రిపురా పదాబ్జ భక్తః
తరయతు మమ నిఖిల మంహసో నికరమ్ II 53 II

తస్యైవ పశ్చిమాయాం
దిశి దళితేన్దేవర ప్రభా శ్యామః I
ఖేటాసి పట్టధారీ
ఖేదా నపనయతు యాతుధానో మే II 54 II

తస్మాదుత్తర భాగే
ధవళాఙ్గో విపుల ఝష వరారూఢః I
పాశాయుధాత్త పాణిః
పాశీ విదలయతు పాప జాలాని II 55 II

వన్దే తదు త్తర హరిత్కోణే
వాయుం చమూరు వర వహమ్ I
కోరకిత తత్త్వబోధాన్
గోరక్ష ప్రముఖ యోగినోపి ముహుః II 56 II

తరుణీ రిడా ప్రధానా
స్తిస్రో వాతస్య తత్ర కృతవాసాః I
ప్రత్యగ్ర కాపిశాయన
పాన పరిభ్రాన్త లోచనాః కలయే II 57 II

తల్లోక పూర్వభాగే
ధనదం ధ్యాయామి సేవధి కులేశమ్ I
అపి మణిభద్ర ముఖ్యా
నమ్బా చరణాబ్జ లమ్బినో యక్షాన్ II 58 II

తస్యైవ పూర్వ సీమని
తపనీయారచిత గోపురే నగరే I
కాత్యాయనీ సహాయం
కలయే శీతాంశు ఖణ్డ చూడాలమ్ II 59 II

తత్పుర షోడశవర్ణ
స్థలభాజ స్తరుణ చన్ద్ర చూడాలాన్ I
రుద్రాధ్యాయే పఠితాన్
రుద్రాణీ సహచరాన్ భజే రుద్రాన్ II 60 II

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

28, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీ ఆర్యాద్విశతి – 2వ భాగము


గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ
II క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 2 భాగము II (శ్రీ లలితాస్తవరత్నమ్)


అనయోర్మధ్యే సన్తత
మఙ్కూరిత దివ్యగన్ధ కుసుమాయామ్ I
మన్దార వాటికాయాం మానస
మఙ్గీకరోతు మే విహృతిమ్ II 20 II

తస్యామిషోర్జలక్ష్మీ
తరుణీభ్యాం శరదృతు స్సదా సహితః I
అభ్యర్చయన్ స జీయా
దమ్బా మామోద మేదురైః కుసుమైః II 21 II

తస్యర్షి సఙ్ఖ్య యోజన
దూరే దేదీప్యమాన శృఙ్గాఘః I
కలధౌత రచిత మూర్తిః
కల్యాణం దిశతు సప్తమ స్సాలః II 22 II

మధ్యే తయో ర్మరుత్పథ
లఙ్ఘిత విటపాధ్వ కలకణ్ఠే I
శ్రీ పారిజాతవాటీ
శ్రియ మనిశం దిశతు శీతలోద్దేశా II 23 II

తస్యా మతి ప్రియాభ్యాం
సహఖేలన్ సహసహస్య లక్ష్మీభ్యాం I
సామన్తో ఝషకేతో
ర్హేమన్తో భవతు హేమవృద్ధ్యై నః II 24 II

ఉత్తరత స్తస్య మహా
నద్భుత హుతభుక్ఛిఖారుణ మయూఖః I
తపనీయఖణ్డరచిత
స్తనుతా దాయుష్య మష్టమో వరణః II 25 II

కాదమ్బ విపిన వాటీ
మనయోర్మధ్యభువి కల్పితా వాసామ్ I
కలయామి సూన కోరక
కన్దలితామోద తున్దిల సమీరామ్ II 26 II

తస్యామతీవ శిశిర
స్తప స్తపస్యాఖ్య మాస లక్ష్మీభ్యామ్ I
శివ మనిశం సహితో మే
శీతర్తుర్దిశతు శీతల దిగన్తః II 27 II

తస్యాం కదమ్బ వాట్యాం
తత్ప్రసవామోద మిళిత మధుగన్ధమ్ I
నవావరణ మనోజ్ఞం
శరణం సముపైమి మన్త్రిణీ శరణమ్ II 28 II

తత్రాలయే విశాలే
తపనీయారచిత తరళ సోపానే I
మాణిక్య మణ్టపాన్తే
మహతి సుసింహాసనే మణిఖచితే II 29 II

బిన్దు త్రికోణ పఞ్చ
ద్విప నృప వసువేద దళ కురేఖాఢ్యే I
చక్రేసదా నివిష్టాం
షష్ట్యష్ట త్రింశదక్షరేశానీమ్ II 30 II

తాపిఞ్చి మేచకాఙ్గీం
తాళీదళ ఘటిత కర్ణ తాటఙ్కామ్ I
తామ్బూల పూరిత ముఖీం
తామ్రాధర బిమ్బ దష్ట దరహాసామ్ II 31 II

కుఙ్కుమ పఙ్కిల దేహాం
కువలయ జీవాతు శాబకవతంసామ్ I
కోకనద శోణ చరణాం
కోకిల నిక్వాణ కోమలాలాపామ్ II 32 II

వామాఙ్క కలిత చూళీ
వలమాన కదమ్బ మాలికాభరణమ్ I
ముక్తా లల న్తికాఞ్చిత
ముగ్ధాళిక మిళిత చిత్రకోదారామ్ II 33 II

కర విధృత కీర శాబక
కలనినద వ్యక్త నిఖిల నిగమార్ధామ్ I
వామ కుచ నిహిత వీణా
వాదన సౌఖ్యార్ధ మీలితాక్షి యుగామ్ II 34 II

ఆ పాటలాంశుకధరా
మాదిరసోన్మేష వాసిత కటాక్షామ్ I
ఆమ్నాయ సార ఘుటికా
మాద్యాం సఙ్గీత మాతృకాం వన్దే II 35 II

తస్య చ సువర్ణసాల
స్యోత్తరత స్తరుణ కుఙ్కుమ చ్ఛాయః I
శమయతు మమ సన్తాపం
సాలో నవమస్తు పుష్యరాగ మయః II 36 II

అనయో ర న్తరవసుధాః
ప్రణూమః ప్రత్యగ్ర పుష్యరాగ మయీః I
సింహాసనేశ్వరీ మను
చిన్తన ని స్తన్ద్ర సిద్ధ నీరన్ధ్రాః II 37 II

తత్సాలోత్తర దేశే
తరుణ జపాకిరణ ధోరణీ శోణః I
ప్రశమయతు పద్మరాగ
ప్రాకారో మే పరాభవం దశమః II 38 II

అన్తర భూకృతవాసా
ననయో రపనీత చిత్త వైమత్యాన్ I
చక్రేశ పదభక్తాం శ్చారణ
వర్గా నహర్నిశం కలయే II 39 II

సారఙ్గవాహ యోజన
దూరే సఙ్ఘటిత కేతన స్తస్య I
గోమేధికేన రచితో
గోపాయతు మాం సమున్నత స్సాలః II 40 II

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

27, ఆగస్టు 2012, సోమవారం

శ్రీ ఆర్యాద్విశతి – 1వ భాగము


II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 1 భాగము II 
(శ్రీ లలితాస్తవరత్నమ్)

అస్తు తచ్ఛ్రేయసే నిత్యం

వస్తు వామాఙ్గ సున్దరం I
యత స్తృతీయం విదుషా
తురీయం త్రైపురం మహః II

పుంరూపాం వా స్మరేద్దేవీం
స్త్రీరూపాం వా విచిన్తయేత్ I
అథవా నిష్కలం ధ్యాయేత్
సచ్చిదానన్ద లక్షణమ్ II

అస్య శ్రీ లలితా స్తవరత్న మహామన్త్రస్య I భగవాన్ క్రోధభట్టారకః శ్రీ దుర్వాసో ఋషిః ఋషయే నమః (శిరసి) ఆర్యాపఙ్తిః ఛన్దః ఛన్దసే నమః (ముఖే) సపరివారా శ్రీలలితా పరాభట్టారికా దేవతా (హృదయే)

బీజ – శక్తి – కీలకములు
ఐం. తాపిఞ్చ మేచకాఙ్గీం
తామ్రాధర బిమ్బ దష్ట దరహాసాం I
తామ్బూల పూరిత ముఖీం
తాళీదళ ఘటిత కర్ణ తాటఙ్కామ్ II
ఇతి బీజం బీజాయ నమః
సౌః. ధూర్తానా మతిదూరా
వార్తా శేషావలగ్న కమనీయా I
ఆర్తాళీ శుభదాత్రీ
వార్తాళీ భవతు వాఞ్ఛితార్థా II
ఇతి శక్తిః శక్తయే నమః
క్లీం. ఆదిమ రసావలమ్బాం
అనిదం ప్రధమోక్తి వల్లరీ కలికామ్ I
ఆ  బ్రహ్మ కీట జననీం
అన్తః కలయామి సున్దరీ మనిశమ్ II
ఇతి కీలకమ్ – కీలకాయ నమః
శ్రీలలితా ప్రీత్యర్థే స్తవరత్న పారయణే వినియోగః I

II ధ్యానం II
ఆదిమ రసావలమ్బా
మనిదం ప్రథమోక్తి వల్లరీ కలికామ్ I
ఆబ్రహ్మ కీట జననీ
మన్తః కలయామి సున్దరో మనిశమ్ II
నతజన సులభాయ నమో
నాళీక సనాభి లోచనాయ నమః I
నన్దిత గిరిశాయ నమో
మహ్సే నవనీప పాటలాయ నమః II
పవనమయి పావకమయి
క్షోణిమయి వ్యోమయి కృపీటమయి I
రవిమయి శశిమయి దిఙ్మయి
సమయమయి ప్రాణమయి  శివే పాహి II
కాళీ ! కపాలని ! శూలిని !
భైరవి ! మాతఙ్గీ ! పఞ్చమీ ! త్రిపురే !
వాగ్దేవీ ! విన్ధ్యవాసిని !
బాలే ! భువనేశి ! పాలయ చిరం మామ్ II
శ్రీలలితామ్బాయై నమః

II అథ శ్రీలలితా స్తవరత్న మహామన్త్రమ్ II
వన్దే గజేన్ద్ర వదనం
వామాఙ్కారూఢ వల్లభాశ్లిష్టమ్ I
కుఙ్కుమ పరాగ శోణం
కువలయినీ జార శాబకాపీడమ్ II 1 II

స జయతి సువర్ణ శైలః
సకల జగచ్చక్ర సంఘటిత మూర్తిః I
కాఞ్చన నికుఞ్జవాటీ
కన్దళదమరీ ప్రపఞ్చ సఙ్గీతః II 2 II

హరిహయ నైర్ ఋత మారుత
హరితా మన్తేష్వవస్థితం తస్య I
వినుమ స్సానుత్రితయం
విధి హరి గౌరీశ విష్టపాధారమ్ II 3 II

మధ్యే పునర్మనోహర
రత్నరుచి స్తబక రఞ్జిత దిగన్తమ్ I
వినుమ స్సానుత్రితయం
విధి హరి గౌరీశ విష్టపాధారమ్ II 4 II

తత్ర చతుశ్శతయోజన
పరిణాహం దేవశిల్పినా రచితమ్ I
నానాసాల మనోజ్ఞం
నమామ్యహం నగర మాదివిద్యాయాః II 5 II

ప్రథమం సహస్రపూర్వక
షట్ఛత సఙ్ఖ్యాక యోజనం పరితః I
వలయీకృత స్వగాత్రం
వరణం శరణం వ్రజామ్యయో వరణమ్ II 6 II

తస్యోత్తరే సమీరణ
యోజన దూరే తరఙ్గితచ్ఛాయః I
ఘటయతు ముదం ద్వితీయో
ఘణ్టాస్వనసారనిర్మితస్సాలః II 7 II

ఉభయో రన్తరసీమ న్యుద్దామ
భ్రమర రఞ్జితో దారమ్ I
ఉపవన ముపాస్మహే వయ
మూర్తీకృత మన్దమారుత స్పన్దమ్ II 8 II

ఆలిఙ్గ్య భద్రకాళీ మాసీన
స్తత్ర హరిశిలా శ్యామామ్ I
మనసి మహాకాళో మే
విహరతు మధుపాన విభ్రమన్నేత్రః II 9 II

తృతీయా వరణ
స్తస్యోత్తరసీమ్ని వాత యోజనతః I
తా మ్రేణ రచితమూర్తి
స్తమతా దాచన్ద్రతారకం భద్రమ్ II 10 II

మధ్యే తయోశ్చ మణిమయ
శాఖా ప్రసూన పక్ష్మళితామ్ I
కల్పానోకహవాటీం కలయే
మకరన్ద పఙ్కిలావాలామ్ II 11 II

తత్ర మధు మాధవశ్రీ
తరుణీభ్యాం తరళ దృక్చకోరాభ్యామ్ I
ఆలిఙ్గితో వతాన్మా
మనిశం ప్రథమర్తు రాత్త పుష్పాస్త్రః II 12 II

నమత తదుత్తరభాగే
నాకీ పథోలాసి శృఙ్గ  సఙ్ఘాతమ్ I
సీసాకృతిం తురీయం
సితకిరణాలోక నిర్మలం సాలమ్ II 13 II

సాలద్వయా న్తరాళే
సరళానిల పోత దారు సుభగాయామ్ I
సంతాన వాటికాయాం
సక్తం చేతోస్తు సతత మస్మాకమ్ II 14 II

తత్ర తపనాతి రూక్షః
సమ్రాఙ్ఞీ చరణ రఞ్జిత స్వాన్తః I
శుక్ర శుచి శ్రీ సహితో
గ్రీష్మర్తుర్దిశతు కీర్తి మాకల్పమ్ II 15 II

ఉత్తర సీమని తస్యోన్నత
శిఖరోల్లాసి హాటక పతాకః I
ప్రకటయతు పఞ్చమోనః
ప్రాకారః కుశల మారకూట మయః II 16 II

ప్రాకారయోశ్చ మధ్యే
పల్లవితాన్యభృత పఞ్చమోద్ఘోషా I
హరిచన్దన ద్రువాటీ
హరతా దామూల మస్మదనుతాపమ్ II 17 II

తత్ర నభశ్శ్రీముఖ్యై
స్తరుణీ ముఖ్యై స్సమన్వితః పరితః  I
వజ్రాట్టహాస ముఖరో
వాఞ్ఛాపూర్తిం తనోతు వర్షర్తుః II 18 II

మారుత యోజన దూరే
మహనీయ స్తస్యచోత్తరే భాగే I
భద్రం కృషీష్ట షష్ఠః
ప్రాకారః పఞ్చ లోహధాతు మయః II 19 II

అనయోర్మధ్యే సన్తత
మఙ్కూరిత దివ్యగన్ధ కుసుమాయామ్ I
మన్దార వాటికాయాం మానస
మఙ్గీకరోతు మే విహృతిమ్ II 20 II 
II సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు II


భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి వైభవము



II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి వైభవము II

మన ప్రాచీన భారతీయ ఋషులలో శ్రీవిద్యలోనూ, శైవములోనూ రెండిటా సిధ్ధిని పొంది, పరబ్రహ్మమును దర్శించినవారు, శ్రీ లలితా పరాభట్టారికా అమ్మవారి యొక్క పన్నెండు మంది ప్రఖ్యాత శ్రీవిద్యోపాసకులలో ఒకరైనవారు, సాక్షాత్తు శివాంశలో జన్మించినవారు శ్రీశ్రీశ్రీ దుర్వాసో మహర్షి. దుర్వాసో మహర్షినే క్రోధ భట్టారక అనే పేరుతోనూ పిలుస్తారు, క్రోధ భట్టారక అంటే వారిది సాధారణ మానవులలాగా ఉండే తామసిక/రాజసిక క్రోధము కాదు. వారి క్రోధము లోక కళ్యాణము కోసమై ఉపకరిస్తుంది. అందుచేత మనవంటి వాళ్ళకు కలిగే తుఛ్చమైన కోపముతో వారి కోపమును పోల్చకూడదు. మహాత్ముల ప్రతీ గుణమూ లోకకళ్యాణము కొరకే అని గుర్తెరిగి ఉండాలి. దుర్వాసో మహర్షి, అమ్మ వారి యొక్క సాత్త్విక కోపమునకు ప్రతీక. ఆయన కోపము, భక్తులను సరిదిద్దడానికి, తద్వారా వారిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇదే అమ్మ వారి యొక్క అమితమైన క్రియా శక్తి.

ఆర్ష వాఙ్మయములో ‘భట్టారకా’ అని పిలువబడినవారు ముగ్గురు. ఒకరు సాక్షాత్తు శ్రీ లలితా పరాభట్టారికా అమ్మవారు. రెండవవారు క్రోధ భట్టారక అని పిలువబడిన దుర్వాసో మహర్షి, మూడవవారు శృంగార భట్టారక అని పిలువబడిన మహాకవి కాళిదాసు గారు.

శ్రీ దుర్వాసో మహర్షి సాక్షాత్తు పరమ శివుని అంశలో, అత్రి మహర్షి మరియు అనసూయ మాతకి పుట్టారు. త్రిమూర్తులు అత్రి అనసూయల తపస్సును పరీక్షించడానికి వచ్చినప్పుడు, అనసూయ మాత వారికి భోజనం వడ్డించబోతే, ఆమె నగ్నంగా వడ్డిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తామని అనడంతో, త్రిమూర్తులే ఇలా వచ్చారు అని గుర్తు పట్టిన ఆ తల్లి, తన పాతివ్రత్య బలముతో ఆ ముగ్గురిని పసి పాపలుగా చేసి, అన్నం తినిపించి, ఊయలలో వేసి ఆడిస్తూ ఉంటుంది. ఇంతలో త్రిమూర్తుల యొక్క భార్యలైన ముగురమ్మలు, వారి వారి పతులకోసం వెతికి అత్రి ఆశ్రమానికి వచ్చి, పతి భిక్ష పెట్టమని అర్ధిస్తారు. అంతట అనసూయ మాత ఆ పాపలను మళ్ళీ మంత్ర జలం చల్లి త్రిమూర్తులకు యథా స్వరూపాన్నిస్తుంది. అప్పుడు అనసూయ మాత యొక్క పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు వరం కోరుకోమంటారు. ఆ తల్లి త్రిమూర్తులే నాకు బిడ్డలుగా రావాలని అడుగుతుంది. తత్ఫలితంగా, శివుడు దుర్వాసుడిగానూ, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుల వారి గానూ, చతుర్ముఖ బ్రహ్మగారు చంద్రుడి గానూ పుట్టిన వైనం అందరికీ తెలిసే ఉంటుంది. పరమశివుడే నాలుగు యుగాలలోనూ దుర్వాస, పరశురామ, ధౌమ్య మరియు ఆదిశంకరభగవత్పాదాచార్యులుగా వచ్చారని పెద్దలు చెప్తారు. శ్రీ దుర్వాసో మహర్షి అమ్మవారిని ఆరాధించ ప్రముఖమైన శ్రీవిద్యోపాసకులలో ఒకరు. దుర్వాస మహర్షి ఇచ్చిన శ్రీవిద్యా విభాగమును సాది విద్య అంటారు. అలాగే లోపాముద్ర అమ్మ ఇచ్చిన శ్రీవిద్యా విభాగమును హాది విద్య అంటారు.
కంచి కామాక్షీ అమ్మవారి మూల స్వరూపం ఎదురుగా భూ-ప్రస్థాన శ్రీచక్రమును ప్రతిష్ఠ చేసినది శ్రీ దుర్వాసో మహర్షియే. వారు అమ్మవారిని కీర్తిస్తూ, లలితా స్తవరత్నము (దీనినే ఆర్యా ద్విశతి అంటారు), త్రిపుర మహిమ్న స్తోత్రము (ఈ స్తోత్రం మొత్తం మంత్ర శాస్త్రమే), పరాశంభు మహిమ్న స్తోత్రము అనే మూడు అద్భుతమైన స్తోత్రములు చేశారు.

వారు చేసిన లలితా స్తవరత్నము అనే స్తోత్రము “ఆర్యా ద్విశతి”గా ప్రఖ్యాతి వహించిన స్తోత్రము. కామాక్షీ అమ్మవారి వైభవమును, శ్రీచక్ర రహస్యాలను వర్ణించే స్తోత్రములు ఇప్పటి వరకు ఆర్షవాఙ్మయములో మూడు ఉన్నాయి. మొదటిది దుర్వాసో మహర్షి ప్రణీత ఆర్యాద్విశతి, రెండవది శంకర భగవత్పాదులు చేసిన సౌందర్య లహరి, మూడవది మూకశంకరులు చేసిన మూకపంచశతి. ఈ మూడు స్తోత్రములు అమ్మవారిని కీర్తించిన అత్యత్ద్భుతమైన స్తోత్ర రాజములు. దుర్వాసో మహర్షియే సరస్వతీ అమ్మవారి శాపం వలన, మూక శంకరులుగా తిరిగి జన్మించారని పెద్దలు చెప్తారు.

పైన వ్రాసిన స్తోత్రములే కాకుండా, శ్రీ దుర్వాస మహర్షి "సౌభాగ్య చింతామణి కల్పము" ఇచ్చారు. దీనినే దుర్వాస సంహిత అని కూడా అంటారు. ఈరోజుకీ కంచి కామాక్షీ అమ్మవారి దేవాలయములో అమ్మవారి ఆరాధన ఈ చింతామణి కల్పము ఆధారముగానే చేస్తారు.

 
దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం. ఎంతో మంది శ్రీవిద్యోపాసకులకు దుర్వాసో మహర్షి ఆరాధ్య దైవం మరియు సద్గురువు. గురువు నుండి పొందిన శ్రీవిద్యా మంత్రాలు, ఏ కొంచెమైనా కూడా, పూనికతో కామాక్షీ ఆలయంలో అనుష్ఠిస్తే, వారికి తప్పకుండా దుర్వాసో మహర్షి అనుగ్రహం లభిస్తుందనీ, వారికి ఆయనే ఉపాసనలో ముందుకు నడిపించే దిశానిర్దేశం చేస్తారనీ ఎంతో మంది భక్తుల అనుభవం.   

దీనికి ఉదాహరణ, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మీనాక్షీ అమ్మళ్ అని ఒక తల్లి ఉండేది. ఆమెకి చాలా చిన్న వయసులోనే ఆమె మామగారే గురువై శ్రీవిద్యా దీక్ష ఇచ్చారు. అయితే, ఆమె ఎన్నో రోజులు సాధన చేయకమునుపే, ఆ గురువు (ఆమె యొక్క మావగారు) తనువు చాలించారు. అప్పటికి ఆ తల్లికి శ్రీవిద్యోపాసనలో ఇంకా సాధనాబలం లేదు. ఆమెకి గురువు గారు ఇచ్చిన మూలమంత్రము ఒక్కటే తెలుసు. ఆమె ఆ మూలమంత్రమునే భక్తితో కొంత కాలం సాధన చేసింది. అయితే ఆమె తరచుగా తిరువారూర్ లో ఉన్న కమలామ్బికా అమ్మవారి క్షేత్రములో కూర్చుని ఆ మంత్ర జపము చేసేది. ఒకనాడు, అదేవిధముగా ఆ ఆలయములో జపం చేస్తూ ఉంటే, మంచి స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు ఆమె యెదుటకి వచ్చి, నువ్వు కంచిలోని శ్రీవిద్యా పరమేశ్వరీ అమ్మవారి సన్నిధికి (అంటే కామాక్షీ అమ్మయే) వెళ్ళు, అక్కడ నీవు చేసే మంత్ర జపమునకు న్యాసము (కరన్యాసము, అంగన్యాసము) కూడా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెంటనే కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఆమెకి ఇక్కడ కూడా అదే వృధ్ధుడు దర్శనమిచ్చి, అక్కడ అమ్మ వారి ప్రాంగణములోనే ఉన్న మరొకరిని చూపించి ఆయనని ఆశ్రయించమని చెప్పారు. వెంటనే ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారి పాదములకు నమస్కారం చేసి, జరిగినదంతా చెప్పింది. ఆ పెద్ద మనిషి మైసూర్ కు చెందిన శ్రీ యజ్ఞనారాయణ శాస్త్రి అనే ఒక గొప్ప శ్రీవిద్యోపాసకుడు. శాస్త్రి గారు, నేను నీకు ఎలా తెలుసమ్మా అని ఆవిడని అడిగితే, ఆ తల్లి వెనుకకు తిరిగి, అక్కడ నిల్చున్న వృధ్ధుడిని చూపించింది. విచిత్రముగా, ఆ వృధ్ధుడు శాస్త్రి గారు, ఆ తల్లి ఇద్దరూ చూస్తుండగా అంతర్ధానం చెందారు. తదుపరి ఆ తల్లి కామాక్షీ ఆలయంలో ప్రదకక్షిణ చేస్తూ ఉండగా, దుర్వాస మహర్షి సన్నిధికి వచ్చి నమస్కరించగానే, అక్కడ అంతర్ధానం చెందిన వృధ్ధుడే దుర్వాస మహర్షి మూర్తి యందు కనబడి, ఆమెను దీవించారు. ఇది నిత్య సత్యమైన లీల. ఇప్పటికీ ఆ తల్లి ప్రతీ యేటా కంచి వెళ్ళి అమ్మ దర్శనముతో పాటు, దుర్వాస మహర్షి యొక్క దర్శనము కూడా పొందుతారు.


దుర్వాస మహర్షి చేసిన ఆర్యా ద్విశతిలో శ్రీనగర(శ్రీచక్ర) వర్ణన చేయబడినది. శ్రీమాత – శ్రీచక్రము – శ్రీవిద్యా ఈ మూడు అభేదములు. ఈ స్తోత్రములో మొత్తం రెండు వందల శ్లోకాలు ఉన్నాయి. ఈ స్తోత్రము అరుదైన ఆర్యా ఛందస్సులో ఆర్యా మహాదేవిపై వ్రాయబడిన పరమ పవిత్రమైన స్తోత్రము. శ్రీచక్ర బిందు స్థానములో, కామేశ్వరుని వామాంకారూఢయై, వివిధ ఆవరణలలో నివసించే దేవతలందరి చేత నిత్యం పూజలందుకొనే శ్రీరాజరాజేశ్వరీ అమ్మ వారిని అభివర్ణిస్తుంది ఈ ఆర్యాద్విశతి స్తోత్రం. నడిచే దేవుడు, కంచి పరమాచార్య, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారు “ఈ స్తోత్రం చదవితే, మనో నేత్రం ముందు అంబికా రూపం కనబడుతుంది అని” చెప్పారు.

ఇంత అద్భుతమైన ఈ స్తోత్రమును 1920 లో బ్రహ్మశ్రీ కనుపర్తి వెంకటరామ శ్రీవిద్యానందనాథ గారు మొట్ట మొదట తెలుగులోకి అనువదించారు. అది పూర్తి గ్రాంధిక తెలుగులో ఉంటుంది. వీరి తర్వాత 1935-38 ప్రాంతంలో, కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారి ప్రత్యక్ష దర్శన, ఆశీస్సులను పొందిన శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు అనే పండితుడు ఆర్యా ద్విశతి మరియు మూక పంచశతి లను తెలుగులోకి అనువదించారు. అయితే వీరు చేసిన ఈ అనువాదములు ప్రస్తుతం ఎక్కడా లభించలేదు.

వీరి తర్వాత, 1998 ప్రాంతములో, బ్రహ్మశ్రీ నాగపూడి కుప్పుస్వామి అయ్యర్ అనే గొప్ప సంస్కృత, తమిళ, తెలుగు భాషలలో పండితుడు, దుర్వాస కృత ఆర్యా ద్విశతికి మరియు శ్రీ శ్రీవిద్యానందనాథ వారు వ్రాసిన శ్రీచక్ర నగర వర్ణన ని రెంటినీ ప్రామాణిక తెలుగులోకి అనువాదం చేశారు. అదృష్టవశాత్తు వీరు వ్రాసిన ఈ అద్భుతమైన పుస్తకము, ఇప్పుడు కూడా దొరుకుతోంది. కావలసిన వారు ఈ క్రింది లంకె నుండి ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు.



ఈ స్తోత్రములో ఉన్న శ్లోకాలను, రోజుకి ఇరవై శ్లోకాల చొప్పున, పది రోజులలో దీనిని అందరితో పంచుకోవాలని సంకల్పము. అవ్యాజకరుణామూర్తి అయిన శ్రీ కామాక్షీ అనుగ్రహముతో ఇంత అత్యద్భుతమైన ఈ ఆర్యాద్విశతి స్తోత్రము అందరమూ చదివి, అమ్మవారి కృపకు పాత్రులము అవుదాము.

II సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు II

15, ఆగస్టు 2012, బుధవారం

యజుర్వేదాంతర్గత ఘోష శాంతి మంత్ర పాఠము

శ్రీ గురుభ్యో నమః

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 


ఋషి సమానుడు అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు (వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనే పద్యంలో) అడిగినట్లుగా, మన దేశమునకు నిజమైన స్వాతంత్ర్యము త్వరలోనే రావాలని, మనలోనూ, బయటా ఉన్న ఆసురీ శక్తులు నశించాలనీ, మళ్ళీ శ్రీరామ రాజ్యంలోలాగా, అందరూ ధర్మ బధ్ధముగా, శాంతి సౌఖ్యాలతో బ్రతకాలనీ ఆశిస్తూ..... యుజుర్వేదాంతర్గత ఘోష శాంతి మంత్ర పాఠము(సుస్వర) ఈ క్రింద లంకెలో PDF ఫైల్ గా జత చేస్తున్నాను.


అందరమూ ఈ శాంతి మంత్రములను విని, చదివి.... మనకీ, మన కుటుంబాలకీ, మన దేశానికీ..... యావత్ మానవాళికీ శాంతి కలగాలని ప్రార్ధిర్ధాం...

II పృథివీ శాంతిః అంతరిక్షగ్ం శాంతిః ద్యౌశ్శాంతిః దిశా శాంతిః అంతర్దిశా శాంతిః అగ్ని శాంతిః వాయుః శాంతిః ఆదిత్యః శాంతిః చంద్రమా శాంతిః నక్షత్రాణి శాంతిః ఆపః శాంతిః ఓషధయశ్శాంతిః వనస్పతయశ్శాంతిః గో శాంతిః అజా శాంతిః అశ్వః శాంతిః పురుషః శాంతిః బ్రహ్మ శాంతిః బ్రాహ్మణః శాంతిః శాంతి రేవ శాంతిః శాంతి ర్మే అస్తు శాంతిః II

ఓం శాంతిః శాంతిః శాంతిః


II సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు II