14, మార్చి 2012, బుధవారం

మూకపంచశతి - మొత్తం 5 శతకములు

ఓం శ్రీ కామాక్ష్యై నమః
 ఓం శ్రీ గురుభ్యో నమః
కామాక్షీ అమ్మవారి మరియు ఏకాంబరేశ్వరుని నిర్హేతుక కృపా కటాక్షముల వలన, అనేక రోజులుగా (నెలలుగా) వివిధ భాగాలుగా తెలుగు లిపిలో వ్రాస్తున్న "మూకపంచశతి-5 శతకములు" మొత్తం పూర్తి అయ్యాయి. ఇందులోని మొత్తం ఐదు శతకాలు (500 శ్లోకాలు) కలిపి ప్రింట్ తీసుకుని పారాయణ చేయడానికి వీలుగా ఒకే PDF పుస్తకంగా చేసి ఈ క్రింద లంకెలో పొందుపరిచాను. కావలసిన వారు ఈ లంకె లోకి వెళ్ళి దానిని ప్రింట్ తీసుకోవచ్చు. 


మూకపంచశతి - 5 శతకములు
 
అంతేకాక, శ్రీ చెరువు కాశీవిశ్వనాథ ప్రసాద్ గారి సహాయం వల్ల, మూకపంచశతి యొక్క ప్రతిపదార్ధ

 సహిత తాత్పర్యం దొరికే చోటు లభించింది. దీనిని తెనాలి లోని, సాధనా గ్రంధ మండలి వారు ప్రచురించారు. మూక పంచశతి లోని ఐదు శతకములను శ్రీ దోర్భల విశ్వనాథ శాస్త్రి గారు తెలుగులోకి అనువదించారు. ఈ క్రింది చిరునామా నుండి వారికి ఫోన్ చేసి ఈ పుస్తకాలు తెప్పించుకోవచ్చు. ఈ పుస్తకాలు అన్నీ, ఐదు శతకాలకి, ఐదు పుస్తకాలు, అన్నీ కలిపి సుమారు రెండు వందల రూపాయలు మాత్రమే ధర, ఆపై పోస్ట్ లో లేదా కొరియర్ లో పంపించడానికి అయ్యే ఖర్చు అవుతుంది.
 

సాధన గ్రంధ మండలి, 
డోరు నెం.1-35-54, మల్లాదివారి వీధి, 
L.R.M.క్లుబ్బు రోడ్డు, 
ఆక్ష్వర్డ్ స్కూలు ప్రక్కన నాసర్ పేట, 
తెనాలి  ఫోను నెం 08644220857, 
సంప్రదించదగిన వ్యక్తిః శ్రీ హరి శంకర్ శర్మ గారు.

మూకపంచశతి తెలుగులో వ్రాయడానికి సంకల్పించి, వ్రాయడం మొదలు పెట్టినప్పటి నుండి, నిరంతరం ప్రోత్సహిస్తూ, నాకు ఆశీస్సులు అందించిన పెద్దలందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
, ముఖ్యంగా పూజ్యులు శ్రీ చెరువు కాశీ విశ్వనాథ ప్రసాద్ గారికి, శ్రీ రామచంద్రరావు గారికి (శ్రీ భాస్కరానందనాథ గారు), శ్రీ సూర్య నాగేంద్ర గారికి, శ్రీ సురేష్ బాబు గారికి, శ్రీ చింతా రామకృష్ణారావు గారికి,
 శ్రీ చింతా విజయ గారికి, శ్రీ అర్క సోమయాజి గారికి  నా కృతజ్ఞతాభివందనములు.

ఈ జత చేసిన లిపిలో ఏమైనా అక్షర దోషములు ఉంటే, పెద్దలు తెలియజేయగలరు.


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

7 కామెంట్‌లు:

  1. మీ పరిశ్రమ అద్భుతం. మీరు చేస్తున్న ఈ సేవ వల్ల... జగన్మాతా సంతుష్టా,వరదా భవతు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ పాండురంగ శర్మ గారు,

    ధన్యవాదములండీ...
    కేవలం కామాక్షి అమ్మ అనుగ్రహం వల్లనే సాధ్యపడింది. ఏమైనా అక్షర దోషములు ఉంటే తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  3. గూగోలులో స్తోత్రాలగురించి వెదుకుతో ఉండగా మీ బ్లాగు చూడటము జరిగింది. మీ బ్లాగు బాగుందండి. మూకపంచశతి మొత్తము తెలుగులిపిలో టైపు చేసి అందరితో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. హృదయపూర్వక అభినందనలు. మీ కృషి శ్లాఘనీయమైనది. చాలా గొప్ప కార్యం చేసారు. మీకు మీ చల్లని తల్లి అనుగ్రహం, మా నల్లనయ్య కృపాసౌరభం అపారంగా లభించుగాక. మీ బ్లాగు చూసి సంతోషంగా ఆశీర్వదిద్దామని ఇక్కడికి వస్తే అనుకోకుండా బాల్య మిత్రుల ఙ్ఞాపకాల తీపికూడ దొరికింది. కపిలే్శ్వరపురం స్కూలులో నా ప్రాణ స్నేహితులు ఇద్దరు GSR శాస్త్రి, వనమా 60లలో మాట. దీనికి వారధులు శ్రీ గొర్తి సుబ్రహ్మణ్యం. వారికి నా కృతఙ్ఞతలు.
    ఊలపల్లి సాంబశివ రావు,
    భాగవత గణనాధ్యాయి,
    http://pothana-telugu-bhagavatham.blogspot.in/
    www.telugubhagavatam.com/

    రిప్లయితొలగించండి
  5. శ్రీయుతులు సాంబశివరావుగారికి నమస్కారం,

    ధన్యవాదములండీ..శ్రీ గొర్తి సుబ్రహ్మణ్యం గారు మీకు బాల్య స్నేహితులవ్వడం చాలా సంతోషముగా ఉన్నది.
    మీ వద్ద భాగవత దశమ స్కంధం తాత్పర్య సహితముగా ఉంటే లంకె పంపగలరు.

    మీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారాలండి. ఆలస్యానికి క్షంతవ్యుడను. ఇప్పుడు పోతన తెలుగు భాగవత పద్య గద్యాలు టీక టిప్పణులతో పాటు అన్ని 9014 మా జాలికలో ఉన్నాయండి.అవి పనిచేస్తాయేమో చూడండి. మీకు వర్డ్ / ఎక్యెల్ ఎలా కావాలంటే అలా పంపుతాను. ఏవి కావాలంటే అవి పంపుతాను. దయచేసి నా వేగరి విఎస్ ఆర్ఎఓ50ఎట్ డిమైల్.కం కి రాయండి.
      గొర్తి సుబ్రహ్మణ్యం గారు నాకు పరిచయంలేదు. వారి పేరు చూడటం వల్ల నా బాల్య మిత్రులు గొర్తి వారబ్బాయి, వనమా గుర్తు కొచ్చారు. వారు ఎక్కడ ఉన్నారో తెలియదు. అది నా దురదృష్టం. వారిని గుర్తుచేసి నందుకు సుబ్రహ్మణ్యంగారికి, మీకు కృతజ్ఞతలు తెలుపుకున్నా.
      మీ ఇద్దరి స్నేహాన్ని ఆకాంక్షిస్తున్నా. వీలయితే జి+/విఎస్ఆర్ఎఓ50, ఫేస్ బుక్ గణనాధ్యాయి లేదా పోతన తెలుగు భాగవతంల వద్ద స్నేహం కలపండి.

      తొలగించండి
  6. శ్రీ మోహన్ కిషోర్ గారి కి

    నమస్కారములతో హృదయ పూర్వక ధన్యవాదములతో మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తో వ్రాయునది. మీ దయ వల్ల ముక పంచశతి ఆర్య శతకం, కటాక్ష శతకం, స్తుతి శతకం పారాయణం చెయ్యగలిగాను. ఇంక మిగతావి కూడా చెయ్యాలి. శ్రీ చాగంటి గురువు గారి దయ వల్ల ముకపంచశతి అనే ఒక స్తోత్రం రాజం వుందని తెలుసుకుని, వాటిల్లో కొన్ని శ్లోకాలకు గురువు గారి భాష్యం విని పరవశించి పోయి అటువంటి స్తోత్రం మనలాంటి వాళ్ళకి అందుతుందా అని అనుకుంటూ వుండగా మీ లాంటి సహృదయులు ఇలా తెలుగు లో అందించడం నిజంగానే మా అదృష్టo. ఇది కేవలం కామాక్షి అమ్మ వారి కృప వున్న వారే చెయ్యగలరు. శ్రీ కామాక్షి అమ్మ కి దగ్గర కావటానికి మాకు మేరు ఎంతో సహాయ పడ్డారు. అసలు చదువుతుంటే ఎంత మధురం గానో వుంది ఈ స్తోత్రం. సర్వదా కృతజ్ఞురాలిని.

    సుజాత

    రిప్లయితొలగించండి