అస్మద్ శ్రీగురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ వల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
శ్రీ మాత్రే నమః
నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే
II ధ్యానం II
ఆదిమ రసావలమ్బా
మనిదం ప్రథమోక్తి వల్లరీ కలికామ్ I
ఆబ్రహ్మ కీట జననీ
మన్తః కలయామి సున్దరో మనిశమ్ II
నతజన సులభాయ నమో
నాళీక సనాభి లోచనాయ నమః I
నన్దిత గిరిశాయ నమో
మహ్సే నవనీప పాటలాయ నమః II
పవనమయి పావకమయి
క్షోణిమయి వ్యోమయి కృపీటమయి I
రవిమయి శశిమయి దిఙ్మయి
సమయమయి ప్రాణమయి శివే పాహి II
కాళీ ! కపాలని ! శూలిని !
భైరవి ! మాతఙ్గీ ! పఞ్చమీ ! త్రిపురే !
వాగ్దేవీ ! విన్ధ్యవాసిని !
బాలే ! భువనేశి ! పాలయ చిరం మామ్ II
శ్రీలలితామ్బాయై నమః
II ఆర్యా ద్విశతి - 1వ శ్లోకము II
వందే గజేంద్ర వదనం వామాంకారూఢవల్లభా౨౨శ్లిష్టమ్ I
కుంకుమపరాగశోణం కువలయినీజారకోరకాపీడమ్ II
ఎడమతొడయందు కూర్చున్న వల్లభాదేవి చేత కౌగిలింపబడిన వాడు, కుంకుమ పువ్వు పొడి వలె ఎర్రని కాంతి కలవాడు, కలువకొలనుకు విటుడగు చంద్రుని శిరోభూషణముగా కలవాడు, ఏనుగు ముఖము గల విఘ్నేశ్వరుని నేను నమస్కరించుచున్నాను !!
విఘ్నేశ్వరుడు శ్రీలలితాదేవి స్మితము వలన పుట్టాడు అని, విఘ్నేశ్వరుడి పత్ని సిద్ధలక్ష్మి అని లలితోపాఖ్యానములో చెప్పబడినది.
స్మితాద్విఘ్నేశ్వరో జాతో మదక్లిన్న కటస్థలః
సిద్ధలక్ష్మ్యం కితోత్సంగో బాలార్క సదృశ ద్యుతిః II
సిద్ధలక్ష్మ్యం కితోత్సంగో బాలార్క సదృశ ద్యుతిః II
II ఆర్యా ద్విశతి - 2వ శ్లోకము II
స జయతి సువర్ణ శైలః సకలజగచ్చక్రసంఘటితమూర్తిః I
కాంచననికుంజవాటీ కందళదమరీ ప్రపంచసంగీతః II ౨
తాత్పర్యముః సమస్త లోకముల చేత కూర్పబడిన స్వరూపము గలది, బంగారుపొదరుల వరుసలయందు విస్తరించుచున్న దేవతాస్త్రీల సమూహముల యొక్క గానములు కలది, అటువంటి మేరుపర్వతము జయముతో వర్తిల్లుచున్నది.
II ఆర్యా ద్విశతి - 3వ శ్లోకము II
హరిహయ నైరృతమారుత హరితామంతేష్వవస్థితం తస్య I
వినుమస్సానుత్రితయం విధిహరిగౌరీశవిష్టపాధారమ్ II ౩
తాః ఆ మేరు పర్వతం యొక్క తూర్పు, నైరృతి, వాయువ్య దిశల మధ్యలయందు ఉన్నట్టి బ్రహ్మ, విష్ణు, శివుల లోకములకు ఆధారమైనది అయిన సానుత్రితయం అనగా మూడు శిఖరములను స్తోత్రము చేయుచున్నాము.
II ఆర్యా ద్విశతి - 4వ శ్లోకము II
మధ్యే పునర్మనోహరరత్నరుచి స్తబకరంజిత దిగంతమ్ I
ఉపరి చతుశ్శతయోజన ముత్తుంగ శృంగపుంగవముపాసే II ౪
తాః పైన చెప్పిన శిఖరముల నడుమ, పై భాగము నందు ఉండు రమణీయమైన మనీకాంతుల, స్తబక అనగా గుత్తుల చేత, వన్నెపెట్టబడిన, దిక్కులు గలదియు, నాలుగు వందల యోజనముల పొడవైన శృంగపుంగవం-శ్రేష్ఠమగు శిఖరమును నేను ధ్యానించుచున్నాను.
II ఆర్యా ద్విశతి - 5వ శ్లోకము II
తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితమ్ I
నానాసాలమనోజ్ఞం నమామ్యహం నగరమాదివిద్యయాః II ౫
తాః ఆ శిఖరము నందు ఉండు, నాలుగు వందల యోజనముల వైశాల్యము గలదియు, దేవశిల్పినా రచితమ్ - విశ్వకర్మచే నిర్మింపబడినదియు, అనేక ప్రాకారములచేత రమ్యమైనదియు అయిన, ఆదివిద్యాయాః - పురాతన, సనాతన విద్యాస్వరూపిణి అయిన పరాదేవత యొక్క నగరమునకు, అనగా శ్రీపురమునకు, నేను నమస్కరించుచున్నాను.
(సశేషం ....)
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి