22, జూన్ 2016, బుధవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 25


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 126వ శ్లోకము II
చక్రాణాం సకలానాం ప్రథమ మధస్సీమ్ని ఫలకవాస్తవ్యాః I
అణిమాదిసిద్ధయోః మామవంతు దేవీప్రభాస్వరూపిణ్యః II ౧౨౬

తాః సకలానాం చక్రాణాం - అన్ని చక్రముల, అధస్సీమ్ని - అడుగు ప్రదేశము నందు, ప్రథమం - మొదట, ఫలకవాస్తవ్యాః - పీటపై ఉండు, దేవీప్రభా స్వరూపిణ్యః - శ్రీలలితాదేవి యొక్క దేహకాంతి వంటి రూపములు గల, అణిమాదిసిద్ధయః  - అణిమ మొదలగు పది సిద్ధిదేవతలు, మాం - నన్ను, అవంతు - రక్షింతురుగాక !!

చింతామణి గృహము నందు ఉన్న అన్ని చక్రముల అడుగు ప్రదేశము నందు, మొదట పీటపై ఉండు, శ్రీలలితాదేవి దేహకాంతి వంటి తేజోమయమైన రూపము కలిగిన అణిమాది దశ సిద్ధిదేవతలు మమ్మల్ని రక్షింతురుగాక !!

అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తథా I
ఈశితా వశితాచైవ ప్రాప్తిస్సిద్ధిశ్చ సప్తమీ II
ప్రాకామ్యా భుక్తి సిద్ధిశ్చ సర్వకామాభిధా పరా II (లలితోపాఖ్యానము, 24వ అధ్యాయము, 4-5 శ్లోకములు)

II ఆర్యా ద్విశతి - 127వ శ్లోకము II
అణిమాదిసిద్ధిఫలకస్యోపరి హరిణాంకఖండకృతచూడాః I
భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీముఖ్యాశ్చ మాతరో౨స్మాకమ్ II ౧౨౭

తాః అణిమాదిసిద్ధి ఫలకస్యోపరి - అణిమాది సిద్ధిదేవతలు నివసించున్ పీటకుమీద ఉండు, హరిణాంకఖండకృతచూడాః - బాలచంద్రుని శిరోభూషణముగా గలవారగు, బ్రాహ్మీముఖ్యాశ్చ - బ్రాహ్మీ మొదలగు, మాతరః - మాతృదేవతలు, అస్మాకం - మాకు, భద్రం - మంగళములను, క్షేమమును, పక్ష్మళయంతు - వృద్ధిపొందింతురుగాక !!

చింతామణి గృహమునందు, అణిమాది సిద్ధిదేవతలు నివసించు పీటకు పై భాగమున, బాలచంద్రుని శిరస్సున ధరించిన బ్రాహ్మీ మొదలగు మాతృదేవతలు మాకు మంగళములను వృద్ధి పొందింతురుగాక !!

వివరణః బ్రాహ్మి మొదలగు మాతృదేవతలు (అష్టశక్తులు)
బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా I
వారాహీచైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ I
మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజాశ్శోణ విగ్రహాః II

II ఆర్యా ద్విశతి - 128వ శ్లోకము II
తస్యోపరిమణిఫలకే తారుణ్యోత్తుంగపీనకుచభారాః I
సంక్షోభిణీ ప్రధానాః శ్రాంతిం విద్రావయంతు దశముద్రాః II ౧౨౮

తాః తస్యోపరి - ముందు చెప్పబడిన పీటకుపైన, మణిఫలకే - మణినిర్మితమైన పీటయందు, తారుణ్య - యౌవనము చేత, ఉత్తుంగ - ఉన్నతమైన, పీన - గొప్పవియగు, కుచభారాః - స్తనభారములు గలవారగు (అమ్మవారి యొక్క మాతృత్వము), సంక్షోభిణీప్రధానాః - సంక్షోభిణి మొదలగు, దశముద్రాః - పదిమంది ముద్రాదేవతలు, శ్రాంతిం - బడలికను, శ్రమను, మా సంకటములను, విద్రావయంతు - పోగొట్టుదురుగాక !!

చింతామణి గృహము నందు, బ్రాహ్మీదేవతలు నివసించు పీటకు పై భాగమున, మణినిర్మితమైన పీట యందు, యౌవనము చేత ఉన్నతమైన గొప్ప స్తనభారములు కలిగిన సంక్షోభిణి మొదలగు దశ ముద్రాదేవతలు, మా యొక్క బడలికను, శ్రమను, సంకటములను పోగొట్టుదురుగాక !!

వివరణః దశముద్రాదేవతలు - 
తస్యాప్యూర్ధ్వస్థానగతా ముద్రాదేవ్యో మహత్తరాః I
ముద్రావిరచనాయుక్తైర్హస్తైః కమలకాంతిభిః I
సర్వసంక్షోభిణీచైవ సర్వవిద్రావిణీ తథా I
సర్వాకర్షిణికాముద్రా తథా సర్వవశంకరీ I
సర్వోన్మాదనముద్రా చ షష్ఠీ సర్వమహాంకుశా I
సర్వఖేచరముద్రా చ సర్వబీజా తథా పరా I
సర్వయోనిశ్చనవమీ తథా సర్వత్రిఖండికా II (లలితోపాఖ్యానము, 24వ అధ్యాయము 14-15వ శ్లోకము)

II ఆర్యా ద్విశతి - 129వ శ్లోకము II
ఫలకత్రయస్వరూపే పృథులే త్రైలోక్యమోహనేచక్రే I
దీప్యంతి ప్రకటాఖ్యాస్తాం కర్త్రీ చ భగవతీ త్రిపురా II ౧౨౯

తాః ఫలకత్రయస్వరూపే - పైన చెప్పిన మూడు పీటల స్వరూపమగు, పృథులే  గొప్పదియగు, త్రైలోక్యమోహనేచక్రే - త్రైలోక్యమోహనము అను చక్రము నందు, ప్రకటాఖ్యాః - ప్రకటశక్తులను పేరుగల సిద్ధిదేవతలు, అష్టమాతలును, దశముద్రలును (అణిమాది సిద్ధిదేవతలు, బ్రాహ్మీ దేవతలు మరియు సంక్షోభిణీముద్రాదేవతలు), దీప్యంతి - ప్రకాశించుచున్నవారు, తాసాం - వారియొక్క, కర్త్రీ చ - అధిష్టానదేవత, భగవతీ - పరమేశ్వరి యగు, త్రిపురా - త్రిపురాదేవి.

చింతామణి గృహము నందు, మొదటి ఆవరణ - త్రైలోక్యమోహన చక్రము నందు ప్రకటశక్తులని పేరుగల అణిమాది సిద్ధిదేవతలు, బ్రాహ్మీ మొదలగు అష్టదేవతలు మరియు సంక్షోభిణీ మొదలగు దశముద్రాదేవతలు కొలువై ఉన్నారు, ఈ ప్రకట శక్తులకు అధిదేవతయగు త్రిపురాదేవి అమ్మవారిని ధ్యానించుచున్నాను (నమస్కరించుచున్నాను) !

వివరణః 
త్రైలోక్యమోహనేచక్రేయాః ప్రోక్తా అణిమాదయః I
బ్రహ్మ్యాదయశ్చ ముద్రాశ్చ తాలుమూలేన సాసృజత్ I
తదధిష్టాన దేవీంచ త్రిపురాంస్సాంశతో౨సృజత్ II
తాదేవ్యః ప్రకటాభిఖ్యావహ్న్యుత్పన్నే మహాద్యుతౌ I
దేవీ చక్రరథే పర్వనవమం సముపాశ్రితాః II (లలితోపాఖ్యానము)


( సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి