14, జులై 2014, సోమవారం

గురుగుహ స్వామిని - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన

శ్రీగురుభ్యో నమః

గురుగుహస్వామిని

రాగం: భానుమతి          తాళం: ఖణ్డ త్రిపుట

II పల్లవి II

గురుగుహ స్వామిని భక్తిం కరోమి

నిరుపమ స్వే మహిమ్ని పరంధామ్ని

II అనుపల్లవి II

కరుణాకర చిదానన్దనాథాత్మని

కరచరణాద్యవయవ పరిణామాత్మని

తరుణోల్లాసాది పూజిత స్వామిని

ధరణ్యాద్యఖిల తత్వాతీతాత్మని

II చరణమ్ II

నిజరూప జితపావకేన్దు భానుమతి

నిరతిశయానన్దే హంసో విరమతి

అజశిక్షణ రక్షణ విచక్షణ సుమతి

హరిహయాదిదేవతాగణ ప్రణమతి

యజనాదికర్మ నిరత భూసుర హితే

యమనియమాద్యష్టాఙ్గయోగ విహితే

విజయ వల్లీదేవసేనాసహితే

వీరాదిసన్నుతే వికల్పరహితే II

 ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుత్తణి


ఈ కీర్తన యొక్క అర్ధం

హే గురుగుహ స్వామీ! నాకు భక్తిని కలుగజేయి. అసమానమైన తేజస్సుని కలిగిన వాడా, పరబ్రహ్మ స్వరూపమా, ఓ సుబ్రహ్మణ్యా నాకు భక్తిని కలుగజేయి.



కరుణాకరుడైనా చిదానన్దనాథుని ఆత్మా అంటే శివసుతా లేదా ఎప్పుడూ చిత్ స్వరూపంలో తనలో తాను రమించే వాడు ఒక అవతారం స్వీకరించాల్సిన అవసరం లేని వాడా, మా యందు కారుణ్యంతో కరచరణాది అవయవములు పొంది దర్శనమిచ్చినవాడా, సాధకుల చేత తరుణోల్లాసము** మొదలైన గ్రంధములచే పూజింపబడి, ఆరాధింపబడే వాడా, పృథ్వి మొదలగు సకల పంచబూతాలకు అతీతమైన వాడా!!



సూర్య, చంద్రులు, అగ్ని రూపములలో ప్రకాశించు వాడా, హంస వంటి మనసు కలిగిన యోగుల హృదయాలలో నివసించేవాడా, చతుర్ముఖ బ్రహ్మ గారిని శిక్షించి, రక్షించిన వాడా, ఇంద్రాది దేవతలచేత పూజింపబడే వాడా!!



యజ్ఞ యాగాది కర్మలను చేయు భూసురులు అనగా బ్రాహ్మణుల హితము కోరే వాడా, అనగా రక్షించే వాడా, యమ నియమాది అష్టాంగ యోగము ద్వారా ఆరాధింపబడే వాడా, వల్లీ దేవసేనా సహితముగా విజయం పొందిన వాడా, వీరుల చేత కొలువబడే వాడా (అనగా ఎవరు యుద్ధంలో విజయం పొందాలన్నా, వారికి సుబ్రహ్మణ్యానుగ్రహం తప్పకుండా కావాలి, ఎందుకంటే ఆయన దేవసేనాపతి), నామ,రూపములకు అతీతమైన వాడా!! పరబ్రహ్మ స్వరూపుడైన ఓ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యా, గురుగుహా!! మాకు భక్తిని కటాక్షించు.


** తరుణోల్లాసము – అనే పదము శాక్త సంబంధమైన ఆరాధనలో సాధకులు వాడే గ్రంధము. పరశురామ కల్పసూత్రం ప్రకారం, ప్రతీ సాధకుడు ఐదు దశలలో సాధన కొనసాగించాల్సి ఉంటుంది. అవి వరుసగా ఆరంభ, తరుణ, యవ్వన, ప్రౌఢ మరియు ప్రౌఢాంత (వేదాంతములో - వివిదిశ, విచరణ, తనుమానస, సత్త్వపత్తి, అసంశక్తి). ఈ ఐదు దశలు దాటిన తర్వాత మాత్రమే, సాధకుడు ఆరవ దశ (ఉన్మత్త) చేరుకుంటాడు, అప్పుడు మాత్రమే అతనికి కర్మ సంబంధమైన నియమాలకి అతీతుడు కాగలడు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి