9, జులై 2014, బుధవారం

గురుపాద చింతనం

శ్రీగురుభ్యో నమః
 శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ I
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ II

అందమైన శరీరం, భార్య, గొప్ప కీర్తి, మేరుపర్వతమంత ధనం ... ఇలా ఎన్ని ఉన్నా గురుపాదపద్మాలపై మనస్సు లగ్నం కానప్పుడు, ప్రయోజనం ఏమున్నది??

శమాది షట్కప్రదవైభవాభ్యాం
సమాధి దానవ్రత దీక్షితాభ్యామ్ I
రమాధవాంఘ్రిస్థిరభక్తిదాభ్యాం
నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ II
 
శమ, దమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధాన -  అనే సాధన సంపత్తిని ప్రసాదించేవీ, సమాధిని ఇవ్వగలిగేందుకు దీక్షపూనినవీ, విష్ణుపాదాలపై స్థిరభక్తిని ఇవ్వగలిగేవీ అయిన  శ్రీగురుపాదుకలకు నమస్సులు.
(ఋషిపీఠం జూలై నెల సంచిక ప్రథమ పేజీలో నుంచి సంగ్రహించినది).

II పూజ్య గురువు గారికి జయము జయము జయము II

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి