17, జులై 2014, గురువారం

బాలసుబ్రహ్మణ్యం భజేహం - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన



శ్రీగురుభ్యో నమః
బాలసుబ్రహ్మణ్యం భజేహం
రాగం: సురటి               తాళం: ఆది
II పల్లవి II
బాలసుబ్రహ్మణ్యం భజేహం భక్తకల్పభూరుహం శ్రీ
II అనుపల్లవి II
నీలకంఠ హృదానందకరం నిత్య శుద్ధ బుద్ధ ముక్తాంబరమ్
II చరణమ్ II
వేలాయుధధరం సుందరం వేదాంతార్థబోధ చతురం
ఫాలాక్ష గురుగుహావతారం పరాశక్తిసుకుమారం ధీరమ్
పాలిత గీర్వాణాది సమూహం పఙ్చభూతమయ మాయామోహం
నీలకంఠ వాహం సుదేహం నిరతిశయానంద ప్రవాహమ్
 ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుచెందూర్

ఈ కీర్తన యొక్క అర్ధం
బాలసుబ్రహ్మణ్యా!! భక్తుల కోర్కెలను తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, నిన్ను నేను భజిస్తున్నాను.

నీలకంఠుడికి అనగా పరమశివునికి ఆనందము కలిగించు వాడా!!
వేలాయుధా! అనగా శక్తి శూలమును చేతిలో ధరించినవాడా! వేదాంతార్ధములను బోధించుటలో చతురత కలిగిన వాడా!! ప్రణవార్ధమును ఫాలాక్షుడికి (తండ్రికే) వివరించిన వాడు కదా మన పాలబుగ్గల, పార్వతీ స్వరూపుడు..బాల సుబ్రహ్మణ్యుడు! పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ముద్దుల కొడుకు, ధీరత్వం< కలిగినవాడు, బ్రహ్మాది దేవతలందరినీ పాలించువాడు (దేవసేనాపతి), పంచభూతములతో కూడిన మాయను సృష్ఠించినవాడా! (మహామాయినే నమః అని స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో వస్తుంది..) నెమలిని వాహనముగా కలిగిన వాడా!! సుందరమైన రూపము కలవాడా!! నిరయతిశయ ఆనంద స్వరూపమా! ఓ బాల సుబ్రహ్మణ్యా నిన్ను భజిస్తున్నాను.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి