11, జులై 2014, శుక్రవారం

గురుపరంపర - దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదా పీఠం


శ్రీగురుభ్యో నమః

II సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం II


II నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం II


రేపు గురుపౌర్ణమి/వ్యాస పౌర్ణమి. అత్యంత శుభప్రదమైన నైమిత్తిక తిథి. ఇటువంటి పరమపవిత్రమైన రోజున (అనగా రేపు), మన సనాతన ధర్మానికి మూలం, మన భారతదేశ ఖ్యాతికి మూలము, ఈ సృష్టిలో ఎవరు మోక్షం పొందాలన్నా, ఎవరిని ఆశ్రయించకుండా మోక్షం పొందలేమో, త్రిమూర్తులు సైతం ఎవరి వాక్కులను గౌరవించి అనుగ్రహిస్తారో..వారే గురువు. ఈ గురు పరంపర సదాశివుని దగ్గర నుంచి మొదలై (సదాశివుడే అనండి లేక నారాయణుడే అనండి.. శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః కదా..), మధ్యలో వేదవ్యాస మహర్షి మొదలైన మహర్షులతో కూడి, తరువాత శంకర భగవత్పాదాచార్యుల నుండి శృంగేరీ శారదా పీఠ గురు పరంపర, ఈ సమయంలో మనం ప్రత్యక్షంగా చూడగలిగే నడుస్తున్న శారదా స్వరూపం శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి వరకు, మన ఈ గురు పరంపర అవిఛ్చిన్నముగా కొనసాగుతూ ఉంది. అటువంటి గురుపరంపర మొత్తాన్ని ఒక్కసారైనా ఈ గురుపౌర్ణమి నాడు స్మరించడం, భారతీయులుగా, మనకి మాత్రమే ఉన్న అదృష్టం.   

II గురుపరంపర – దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠం II
సదాశివ
నారాయణ
చతుర్ముఖ బ్రహ్మ
వశిష్ఠ మహర్షి
శక్తి మహర్షి
పరాశర మహర్షి
వేదవ్యాస మాహర్షి
శ్రీ శుక ఆచార్య
శ్రీ గౌడపాదాచార్య
శ్రీ గోవింద భగవత్పాద
శ్రీ శంకర భగవత్పాద
1.    శ్రీ శంకర భగవత్పాద
2.    శ్రీ సురేశ్వరాచార్య
3.    శ్రీ నిత్యబోధఘన
4.    శ్రీ జ్ఞానఘన
5.    శ్రీ జ్ఞానోత్తమ
6.    శ్రీ జ్ఞానగిరి
7.    శ్రీ సింహగిరి
8.    శ్రీ ఈశ్వర తీర్థ
9.    శ్రీ నృసింహ తీర్థ
10.    శ్రీ విద్యా తీర్థ
11.    శ్రీ భారతీ తీర్థ
12.    శ్రీ విద్యారణ్య
13.    శ్రీ చంద్రశేఖర భారతి-I
14.    శ్రీ నృసింహ భారతి-I
15.    శ్రీ పురుషోత్తమ భారతి-I
16.    శ్రీ శంకర భారతి
17.    శ్రీ చంద్రశేఖర భారతి-II
18.    శ్రీ నృసింహ భారతి-II
19.    శ్రీ పురుషోత్తమ భారతి-II
20.    శ్రీ రామచంద్ర భారతి
21.    శ్రీ నృసింహ భారతి-III
22.    శ్రీ నృసింహ భారతి-IV
23.    శ్రీ నృసింహ భారతి-V
24.    శ్రీ అభినవ నృసింహ భారతి
25.    శ్రీ సచ్చిదానంద భారతి-I
26.    శ్రీ నృసింహ భారతి-VI
27.    శ్రీ సచ్చిదానంద భారతి-II
28.    శ్రీ అభినవ సచ్చిదానంద భారతి-I
29.    శ్రీ నృసింహ భారతి-VII
30.    శ్రీ సచ్చిదానంద భారతి-III
31.    శ్రీ అభినవ సచ్చిదానంద భారతి-II
32.    శ్రీ నృసింహ భారతి-VIII
33.    శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి
34.    శ్రీ చంద్రశేఖర భారతి-III
35.    శ్రీ అభినవ విద్యాతీర్థ
36.    శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు (ప్రస్తుత పీఠాధిపతులు)

II సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు II

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి