17, జులై 2014, గురువారం

బాలసుబ్రహ్మణ్యం భజేహం - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన



శ్రీగురుభ్యో నమః
బాలసుబ్రహ్మణ్యం భజేహం
రాగం: సురటి               తాళం: ఆది
II పల్లవి II
బాలసుబ్రహ్మణ్యం భజేహం భక్తకల్పభూరుహం శ్రీ
II అనుపల్లవి II
నీలకంఠ హృదానందకరం నిత్య శుద్ధ బుద్ధ ముక్తాంబరమ్
II చరణమ్ II
వేలాయుధధరం సుందరం వేదాంతార్థబోధ చతురం
ఫాలాక్ష గురుగుహావతారం పరాశక్తిసుకుమారం ధీరమ్
పాలిత గీర్వాణాది సమూహం పఙ్చభూతమయ మాయామోహం
నీలకంఠ వాహం సుదేహం నిరతిశయానంద ప్రవాహమ్
 ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుచెందూర్

ఈ కీర్తన యొక్క అర్ధం
బాలసుబ్రహ్మణ్యా!! భక్తుల కోర్కెలను తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, నిన్ను నేను భజిస్తున్నాను.

నీలకంఠుడికి అనగా పరమశివునికి ఆనందము కలిగించు వాడా!!
వేలాయుధా! అనగా శక్తి శూలమును చేతిలో ధరించినవాడా! వేదాంతార్ధములను బోధించుటలో చతురత కలిగిన వాడా!! ప్రణవార్ధమును ఫాలాక్షుడికి (తండ్రికే) వివరించిన వాడు కదా మన పాలబుగ్గల, పార్వతీ స్వరూపుడు..బాల సుబ్రహ్మణ్యుడు! పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ముద్దుల కొడుకు, ధీరత్వం< కలిగినవాడు, బ్రహ్మాది దేవతలందరినీ పాలించువాడు (దేవసేనాపతి), పంచభూతములతో కూడిన మాయను సృష్ఠించినవాడా! (మహామాయినే నమః అని స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో వస్తుంది..) నెమలిని వాహనముగా కలిగిన వాడా!! సుందరమైన రూపము కలవాడా!! నిరయతిశయ ఆనంద స్వరూపమా! ఓ బాల సుబ్రహ్మణ్యా నిన్ను భజిస్తున్నాను.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

16, జులై 2014, బుధవారం

గురుగుహాయ భక్తానుగ్రహాయ - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన



శ్రీగురుభ్యో నమః
గురుగుహాయ భక్తానుగ్రహాయ
రాగం: సామ                తాళం: ఆది
II పల్లవి II
గురుగుహాయ భక్తానుగ్రహాయ కుమారాయ నమో నమస్తే
II అనుపల్లవి II
గురుగుహాయ భక్తానుగ్రహాయ గుణాతీతాయ రూపరహితాయ
హరిహరవిరిఞ్చి రూపాయ సచ్చిదానన్దస్వరూపాయ శివాయ
II చరణమ్ II
సకలాగమ మంత్ర సారజ్ఞాయ సత్సంప్రదాయ సర్వజ్ఞాయ
సకలనిష్కళ ప్రకాశకాయ సామరస్య సంప్రదాయకాయ
వికళేబర కైవల్యదానాయ వికల్పహీనాయ విజ్ఞానాయ
శుక వామదేవ వందిత పదాయ శుక వామదేవ ముక్తిప్రదాయ

ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుత్తణి

ఈ కీర్తన యొక్క అర్ధం
ఓ గురుగుహ స్వామీ! భక్తులను అనుగ్రహించేవాడా! కుమారా! (కుమారా అంటే శివశక్తుల కుమారుడు అని, అసలు కుమార అనే శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యస్వామి వారికి మాత్రమే వర్తిస్తుంది అని అమరకోశం చెబుతుంది) నమో నమస్తే!!

గుణములకు అతీతమైన పరబ్రహ్మస్వరూపమా! రూపము లేని వాడా! త్రిమూర్త్యాత్మకా! త్రిమూర్తుల రూపములో ప్రకాశించే వాడా!! సత్, చిత్, ఆనంద స్వరూపుడా!! ఎల్లప్పుడు మంగళములను మాత్రమే చేయు వాడా!!

సకల ఆగమములు, మంత్రముల యొక్క సారమైన వాడా! అనగా ఆగమాలు, మంత్రాలు ఏ పరబ్రహ్మాన్ని స్తుతిస్తున్నాయో, ఆ పరబ్రహ్మ స్వరూపమా!! సత్సాంప్రదాయములను అవలంబింప చేసే వాడా !! (ఇక్కడ సత్సంప్రదాయములు అంటే వేద విహిత కర్మాచరణ అని అర్ధం. కర్మసిద్ధంతాన్ని పునరుద్ధరించడానికి సుబ్రహ్మణ్యుడే కుమరిలభట్టు రూపములో అవతరించారు). అన్ని కళలను (రూపాలను) తానే అయి ఉన్నవాడు, ఏ కళలు (రూపము) లేనివాడా!! కైవల్యానందము ప్రసాదించువాడా!! నాశము లేనివాడా, సర్వజ్ఞత్వము కలిగిన వాడా!! శుక వామదేవాది మహర్షులచే పూజింపబడే వాడా!! శుక వామదేవులకు ముక్తిని ప్రసాదించినవాడా!!
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

15, జులై 2014, మంగళవారం

గురుగుహాదన్యం - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన



శ్రీగురుభ్యో నమః

గురుగుహాదన్యమ్
రాగం: బలహంస           తాళం: ఝంప
II పల్లవి II
గురుగుహాదన్యం న జానేహం
గుప్తాగమార్థ తత్వప్రబోధినో
II అనుపల్లవి II
అరుణోదయానంత కోటిబ్రహ్మాండాకార
శివాది ధరాన్త తత్వస్వరూపిణో
II చరణమ్ II
సహస్రదళ సరసిజ మధ్యనివాసినః
సకల చంద్రభాస్కర తేజః ప్రకాశినః
సహజానన్దస్థిత దాస విశ్వాసినః
సచ్చిత్సుఖాత్మక విశ్వవిలాసినో
అహరహః ప్రబలహంస ప్రకాశాత్మనో
దహరవిద్యా ప్రదాయక పరమాత్మనో
జహదజహల్లక్షణయా జీవైక్యాత్మనో
రహః పూజిత చిదానన్దనాథాత్మనో

ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుత్తణి

ఈ కీర్తన యొక్క అర్ధం
నాకు గురుగుహ స్వామీ తప్ప వేరు దైవం ఎరుగను. ఆగమముల అర్ధమును ప్రబోధించిన ఓ గురుగుహ స్వామీ, నీవు తప్ప నేను ఎవరినీ ఎరుగను. నీవే నాకు దిక్కు.

అరుణోదయ అంటే, ఎర్రని కాంతి స్వరూపము, అగ్ని స్వరూపము కలవాడా, మొట్ట మొదట ఏకముగా ఉన్న శివతత్వము నుండి, పృథ్వీ తత్వము, అనంత కోటి బ్రహ్మాండ ఆకారములను నీలోనే నింపుకున్న తత్వము కలవాడా!! అనగా ఒక్కడే ఉన్న పరమశివ స్వరూపం దగ్గర నుంచి, నేను అనేకమౌదును గాక వ్యాప్తి చెందిన యావత్ విశ్వం (అనంత కోటి బ్రహ్మాండాలు), మనకి కనబడే ఈ పృథ్వీ అన్నిటిలోనూ ఉన్నది, ఒక పరబ్రహ్మ స్వరూపము.

సహస్రదళములు కలిగిన పద్మము మధ్యలో నివాసము ఊండే వాడా!! (సహస్ర దళ పద్మం ఎక్కడో లేదు, మన సహస్రార చక్రాన్నే యోగ పరిభాషలో అలా చెప్తారు అని విన్నాను. ఒక వ్యక్తి శరీరంలో ఉండగానే కైవల్యానంద స్థితిని పొందినప్పుడు, ఆ సహస్రదళపద్మంలో కొలువై ఉన్న స్వామి దర్శనం అవుతుంది), సూర్య చంద్రులను ప్రకాశింపజేయువాడా!! (అనగా సూర్యుడికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మ సూర్య ప్రకాశానికి కారణం. అలాగే చంద్రుని కాంతి. సూర్య చంద్రుల ప్రకాశానికి కూడా మూలకారణం, ఎవరి ఆజ్ఞానుసారం అవి ప్రకాశాసిస్తున్నాయో -  ఆయనయే పరబ్రహ్మస్వరూపుడైన గురుగుహస్వామి), సహజానంద స్థితిలో ఉండే భక్తులను విశ్వసించే వాడా!! సత్, చిత్, ఆనంద స్వరూపుడా!! దహరవిద్యను ప్రబోధించిన వాడా!! జహల్లక్షణ, అజహల్లక్షణ ల ద్వారా జీవ బ్రహ్మైక్య సిద్ధి కారణమైన వాడా! (ఇవి వేదాంత పరిభాషలో వాడే పదాలు), వైదిక కర్మల ద్వారా ఆరాధింపబడే ఓ చిత్స్వరూపా, శివసుతా!!

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

14, జులై 2014, సోమవారం

గురుగుహ స్వామిని - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన

శ్రీగురుభ్యో నమః

గురుగుహస్వామిని

రాగం: భానుమతి          తాళం: ఖణ్డ త్రిపుట

II పల్లవి II

గురుగుహ స్వామిని భక్తిం కరోమి

నిరుపమ స్వే మహిమ్ని పరంధామ్ని

II అనుపల్లవి II

కరుణాకర చిదానన్దనాథాత్మని

కరచరణాద్యవయవ పరిణామాత్మని

తరుణోల్లాసాది పూజిత స్వామిని

ధరణ్యాద్యఖిల తత్వాతీతాత్మని

II చరణమ్ II

నిజరూప జితపావకేన్దు భానుమతి

నిరతిశయానన్దే హంసో విరమతి

అజశిక్షణ రక్షణ విచక్షణ సుమతి

హరిహయాదిదేవతాగణ ప్రణమతి

యజనాదికర్మ నిరత భూసుర హితే

యమనియమాద్యష్టాఙ్గయోగ విహితే

విజయ వల్లీదేవసేనాసహితే

వీరాదిసన్నుతే వికల్పరహితే II

 ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుత్తణి


ఈ కీర్తన యొక్క అర్ధం

హే గురుగుహ స్వామీ! నాకు భక్తిని కలుగజేయి. అసమానమైన తేజస్సుని కలిగిన వాడా, పరబ్రహ్మ స్వరూపమా, ఓ సుబ్రహ్మణ్యా నాకు భక్తిని కలుగజేయి.



కరుణాకరుడైనా చిదానన్దనాథుని ఆత్మా అంటే శివసుతా లేదా ఎప్పుడూ చిత్ స్వరూపంలో తనలో తాను రమించే వాడు ఒక అవతారం స్వీకరించాల్సిన అవసరం లేని వాడా, మా యందు కారుణ్యంతో కరచరణాది అవయవములు పొంది దర్శనమిచ్చినవాడా, సాధకుల చేత తరుణోల్లాసము** మొదలైన గ్రంధములచే పూజింపబడి, ఆరాధింపబడే వాడా, పృథ్వి మొదలగు సకల పంచబూతాలకు అతీతమైన వాడా!!



సూర్య, చంద్రులు, అగ్ని రూపములలో ప్రకాశించు వాడా, హంస వంటి మనసు కలిగిన యోగుల హృదయాలలో నివసించేవాడా, చతుర్ముఖ బ్రహ్మ గారిని శిక్షించి, రక్షించిన వాడా, ఇంద్రాది దేవతలచేత పూజింపబడే వాడా!!



యజ్ఞ యాగాది కర్మలను చేయు భూసురులు అనగా బ్రాహ్మణుల హితము కోరే వాడా, అనగా రక్షించే వాడా, యమ నియమాది అష్టాంగ యోగము ద్వారా ఆరాధింపబడే వాడా, వల్లీ దేవసేనా సహితముగా విజయం పొందిన వాడా, వీరుల చేత కొలువబడే వాడా (అనగా ఎవరు యుద్ధంలో విజయం పొందాలన్నా, వారికి సుబ్రహ్మణ్యానుగ్రహం తప్పకుండా కావాలి, ఎందుకంటే ఆయన దేవసేనాపతి), నామ,రూపములకు అతీతమైన వాడా!! పరబ్రహ్మ స్వరూపుడైన ఓ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యా, గురుగుహా!! మాకు భక్తిని కటాక్షించు.


** తరుణోల్లాసము – అనే పదము శాక్త సంబంధమైన ఆరాధనలో సాధకులు వాడే గ్రంధము. పరశురామ కల్పసూత్రం ప్రకారం, ప్రతీ సాధకుడు ఐదు దశలలో సాధన కొనసాగించాల్సి ఉంటుంది. అవి వరుసగా ఆరంభ, తరుణ, యవ్వన, ప్రౌఢ మరియు ప్రౌఢాంత (వేదాంతములో - వివిదిశ, విచరణ, తనుమానస, సత్త్వపత్తి, అసంశక్తి). ఈ ఐదు దశలు దాటిన తర్వాత మాత్రమే, సాధకుడు ఆరవ దశ (ఉన్మత్త) చేరుకుంటాడు, అప్పుడు మాత్రమే అతనికి కర్మ సంబంధమైన నియమాలకి అతీతుడు కాగలడు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

12, జులై 2014, శనివారం

గురుపూర్ణిమ సందర్భంగా - శ్రీ శ్రీ శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతీ స్వామి వారి జీవిత విశేషాలు

శ్రీ గురుభ్యో నమః
శ్రీ శ్రీ శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతీ స్వామి వారు

నాకు గురుతుల్యులు, నా శ్రేయోభిలాషులు, పెద్దలు, అనుక్షణం భగవాన్ రమణుల చింతనలో ఉండే పరమ భగవద్భక్తులు, చెన్నై వాస్తవ్యులు, పూజ్యులు శ్రీ డాక్టర్ భరద్వాజ గారు అందించిన శ్రీశ్రీశ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతీ స్వామి వారి జీవిత విశేషాలను, డాక్టర్ భరద్వాజ గారు వ్రాసిన ఆ భాగాలన్నిటినీ ఒక చిన్న పుస్తక రూపంలో ఇక్కడ జత చేశాను. 
ఈ రోజు గురు పూర్ణిమ, ఇటువంటి పరమ పవిత్రమైన రోజున శ్రీశ్రీశ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతీ స్వామి వారి జీవిత చరిత్ర చదవగలగడం - బహుశా గురుమండలి రూపిణీ అయిన కామాక్షీ అమ్మవారి అవ్యాజమైన వాత్సల్యం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇక్కడ జత చేసిన ఈ అద్భుత అమృతాన్ని చదివి, గురుకటాక్షాన్ని పొందుదాము.
సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

11, జులై 2014, శుక్రవారం

గురుపరంపర – కంచి కామకోటి పీఠం


శ్రీగురుభ్యో నమః
II సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం II
II నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం II

II గురుపరంపర – కంచి కామకోటి పీఠం II
సదాశివ
నారాయణ
చతుర్ముఖ బ్రహ్మ
వశిష్ఠ మహర్షి
శక్తి మహర్షి
పరాశర మహర్షి
వేదవ్యాస మాహర్షి
శ్రీ శుక ఆచార్య
శ్రీ గౌడపాదాచార్య
శ్రీ గోవింద భగవత్పాద
శ్రీ శంకర భగవత్పాద
1.    శ్రీ శంకర భగవత్పాద
2.    శ్రీ సురేశ్వరాచార్య
3.    శ్రీ సర్వజ్ఞాత్మనేంద్ర సరస్వతి
4.    శ్రీ సత్య బోధేంద్ర సరస్వతి
5.    శ్రీ జ్ఞానానందేంద్ర సరస్వతి
6.    శ్రీ శుద్ధానందేంద్ర సరస్వతి
7.    శ్రీ ఆనంద జ్ఞానేంద్ర సరస్వతి
8.    శ్రీ కైవల్యానంద యోగేంద్ర సరస్వతి
9.    శ్రీ కృపా శంకరేంద్ర సరస్వతి
10.    శ్రీ సురేశ్వరేంద్ర సరస్వతి
11.    శ్రీ శివానంద చిద్ఘనేంద్ర సరస్వతి
12.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి
13.    శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి
14.    శ్రీ విద్యాఘనేంద్ర సరస్వతి
15.    శ్రీ గంగాధరేంద్ర సరస్వతి
16.    శ్రీ ఉజ్జ్వల శంకరేంద్ర సరస్వతి
17.    శ్రీ సదాశివేంద్ర సరస్వతి
18.    శ్రీ యోగతిలక సురేంద్ర సరస్వతి
19.    శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి
20.    శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి
21.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-II
22.    శ్రీ బోధేంద్ర సరస్వతి
23.    శ్రీ సచ్చిత్సుఖేంద్ర సరస్వతి
24.    శ్రీ చిత్సుఖేంద్ర సరస్వతి
25.    శ్రీ సచ్చిదానంద ఘనేంద్ర సరస్వతి
26.    శ్రీ ప్రజ్ఞా ఘనేంద్ర సరస్వతి
27.    శ్రీ చిద్విలాసేంద్ర సరస్వతి
28.    శ్రీ మహాదేవేంద్ర సరస్వతి-I
29.    శ్రీ పూర్ణబోధేంద్ర సరస్వతి
30.    శ్రీ బోధేంద్ర సరస్వతి-II
31.    శ్రీ బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి
32.    శ్రీ చిదానంద ఘనేంద్ర సరస్వతి
33.    శ్రీ సచ్చిదానంద సరస్వతి
34.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-III
35.    శ్రీ చిత్సుఖేంద్ర సరస్వతి-II
36.    శ్రీ చిత్సుఖానందేంద్ర సరస్వతి
37.    శ్రీ విద్యా ఘనేంద్ర సరస్వతి-II
38.    శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి
39.    శ్రీ సచ్చిద్విలాసేంద్ర సరస్వతి
40.    శ్రీ మహాదేవేంద్ర సరస్వతి-II
41.    శ్రీ గంగాధరేంద్ర సరస్వతి-II
42.    శ్రీ బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి-II
43.    శ్రీ ఆనంద ఘనేంద్ర సరస్వతి
44.    శ్రీ పూర్ణ బోధేంద్ర సరస్వతి-II
45.    శ్రీ పరమశివేంద్ర సరస్వతి-I
46.    శ్రీ సంద్రానంద బోధేంద్ర సరస్వతి
47.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-IV
48.    శ్రీ అద్వైతానంద బోధేంద్ర సరస్వతి
49.    శ్రీ మహాదేవేంద్ర సరస్వతి-III
50.    శ్రీ చంద్రచూడేంద్ర సరస్వతి-I
51.    శ్రీ విద్యా తీర్థేంద్ర సరస్వతి
52.    శ్రీ శంకరానందేంద్ర సరస్వతి
53.    శ్రీ పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి
54.    శ్రీ వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి
55.    శ్రీ చంద్రచూడేంద్ర సరస్వతి-II
56.    శ్రీ సర్వజ్ఞ సదాశివ బోధేంద్ర సరస్వతి
57.    శ్రీ పరమశివేంద్ర సరస్వతి-II
58.    శ్రీ ఆత్మబోధేంద్ర సరస్వతి
59.    శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతి
60.    శ్రీ అద్వైతాత్మ ప్రకాశేంద్ర సరస్వతి
61.    శ్రీ మహాదేవేంద్ర సరస్వతి-IV
62.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-V
63.    శ్రీ మహాదేవేంద్ర సరస్వతి-V
64.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-VI
65.    శ్రీ సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి
66.    శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-VII
67.    శ్రీ మహాదేవేంద్ర సరస్వతి-V
68.    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి-VIII (మహా స్వామి-నడిచే దేవుడు-పరమాచార్య స్వామి వారు)
 69.    శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు (ప్రస్తుత ప్రధాన పీఠాధిపతులు)
 70.    శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు (ప్రస్తుత ఉప పీఠాధిపతులు)
 
II సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు II