26, డిసెంబర్ 2011, సోమవారం

శ్రీ మూక పంచశతి - కటాక్ష శతకము - 4వ భాగం

ఓం శ్రీమాత్రే నమః

II మూక పంచశతి - కటాక్ష శతకం II (31-40 శ్లోకములు)

స్నేహాదృతాం విదలితోత్పలకాంతిచోరాం
జేతారమేవ జగదీశ్వరి జేతుకామః I
మానోద్ధతో మకరకేతురసౌ ధునీతే
కామాక్షి తావక కటాక్ష కృపాణవల్లీమ్ II 31 II

శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిం మునీనాం
కామాక్షి సంతతమపి స్మృతిమార్గగామీ I
కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే
చౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః II 32 II

నిత్యం శృతేః పరిచితౌ యతమానమేవ
నీలోత్పలం నిజసమీప నివాసలోలమ్ I
ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్రః
కామాక్షీ కింతు తవ కాలిమసంప్రదాయమ్ II 33 II

భ్రాన్త్వా ముహుః స్తబకిత స్మితఫేనరాశౌ
కామాక్షి వక్త్రరుచి సంచయవారిరాశౌ I
ఆనందతి త్రిపురమర్దననేత్రలక్ష్మీః
ఆలంబ్య దేవి తవ మందమపాంగసేతుమ్ II 34 II

శ్యామా తవ త్రిపురసుందరి లోచనశ్రీః
కామాక్షి కందలిత మేదురతారకాంతిః I
జ్యోత్స్నావతీ స్మితరుచాపి కథం తనోతి
స్పర్ధామహో కువలయైశ్చ తథా చకోరైః II 35 II

కాలాంజనం చ తవ దేవి నిరీక్షణం చ
కామాక్షి సామ్యసరణిం సముపైతి కాంత్యా I
నిశ్శేషనేత్రసులభం జగతీషు పూర్వం
అన్యత్రినేత్రసులభం తుహినాద్రికన్యే II 36 II

ధూమాంకురో మకరకేతన పావకస్య
కామాక్షి నేత్రరుచి నీలిమచాతురీ తే I
అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య
హర్షోదయం జనయతే హరిణాంకమౌలేః II 37 II

ఆరంభలేశసమయే తవ వీక్షణస్య
కామాక్షి మూకమపి వీక్షణమాత్ర నమ్రమ్ I
సర్వజ్ఞతా సకలలోక సమక్షమేవ
కీర్తిస్వయం వరణమాల్యవతీ వృణీతే II 38 II

కాలాంబువాహ ఇవ తే పరితాపహారీ
కామాక్షి పుష్కరమధః కురుతే కటాక్షః I
పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీం
అన్యస్తు సంతతరుచిం ప్రకటీకరోతి II 39 II

సూక్ష్మే
పి దుర్గమతరేపి గురుప్రసాద-
సాహాయ్యకేన విచరన్ అపవర్గమార్గే I
సంసారపంకనిచయే న పతత్యమూం తే 
కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిమ్ II 40 II 



సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

1 కామెంట్‌: