శ్రీ గురుభ్యో నమః
కామాక్షీ పరదేవతానుగ్రహంతో, మహానారాయణ ఉపనిషత్ కొన్ని అనువాకములు ఈరోజు పారాయణ చేస్తూ ఉంటే, పదకొండవ అనువాకములోని విహితకర్మాచరణ ప్రశంసా నిషిద్ధాచరణనింద గురించి వివరించే అద్భుతమైన ఈ క్రిందిమంత్రము నాకెందుకో మరల మరల స్మరించి గుర్తు పెట్టుకోవాలనిపించింది. ఈ మంత్రమునకు మా వేదం గురువు గారు చెప్పిన అర్ధాన్ని, ఇతర పుస్తకముల నుంచి చదివిన అర్ధాన్ని కలిపి ఒకచోట వ్రాసుకుని ఇంట్లో ఎదురుగా కనబడేలా పెట్టుకోవాలని వ్రాసుకుంటున్నాను.
II విహితాచరణప్రశంసా నిషిధ్ధాచరణనిందా చ (మహానారాయణోపనిషత్ - 11వ అనువాకము ) II
యథాI వృక్షస్యI సంపుష్పిIతస్య దూరాద్గన్ధో వాIIత్యేవం పుణ్యIస్య కర్మణోI దూరాద్గన్ధో వాIతి యథాI౽సిధారాం కర్తే౽వIహితామవక్రామే యద్యువే యువే హవాI విహ్వయిIష్యామి కర్తం పIతిష్యామీత్యేవమమృతాIదాత్మానంI జుగుప్సేIIత్ II 11 II
ఈ మంత్రానికి అర్ధం ఏమిటంటే - ఏ విధముగా బాగుగా పుష్పించిన వృక్షము నుండీ చాలాదూరం వరకు
సుగంధము వ్యాపించునో అదే విధముగా, జ్యోతిష్టోమాది పుణ్య కర్మలను చేయుట వలన వచ్చెడి కీర్తి
కూడా బహుదూరము వరకు వ్యాపించును. అలాగే, ఒక బావి లేదా పెద్దనీటిమడుగు ఉండి ఆ బావి/
మడుగుపైన బాగా పదునైన కత్తులను (అసిధార అని అంటారు) ఉంచి, అప్పుడు ఆ బావిని/మడుగుని
దాటవలసి వస్తే, అప్పుడు మనలో మనము కత్తులు గుచ్చుకుంటే కాలుకోసుకుంటుంది లేక
బావిలో పడిపోతాము అని ఏ విధంగా చింతిస్తామో అలా, ఆంతరములోనూ, బాహ్యములోనూ
పాపచింతన లేక పాపకర్మములను చేయు ప్రవృత్తి/మానసిక దౌర్బల్యము కలవాడు, తనని తాను
అసిధార నుండి మరియు గర్తము నుండీ కాపాడుకొంటూ బావి దాటాలని ఎలా అనుకుంటాడో అదే
విధముగా మోక్షార్ధి అయినవాడు అంతర బాహ్య పాపముల యెడల విముఖతని పొందవలెను.
ఉద్ధరే దాత్మానమాత్మాన మాత్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధువ రాత్మైవ రిపురాత్మనః II
తనను తానే బాగుచేసుకోవాలి. తనను తాను నిందించుకుని పాడుచేసుకోరాదు. తాను చెప్పినట్లు వినే
అంతరాత్మ తన మితృడు అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లుగా, మహానారాయణోపనిషత్ లో
పైన సూచించిన మంత్రాన్ని బాగా స్మరణ చేసుకుని, విహిత కర్మాచరణము నందు ఆసక్తిని,
ఉత్సాహాన్ని, పూనికను పొంది, బావి దాటేటప్పుడు అసిధార+గర్తము లను చూసి ఎట్లా చింతిస్తామో
అలానే నిషిద్ధకర్మాచరణము నందు ప్రయత్నపూర్వకముగా విముఖత పొంది, ఇటు ఆంతరములోనూ,
అటు బాహ్యములో కూడా పాపములను చేసే ప్రవృత్తిని వీడి మనల్ని మనమే ఉద్ధరించుకొనే దిశగా,
మోక్షంవైపు అడుగులు వేద్దాము.
ఆపైన, కామాక్షీ అమ్మవారే మంచి బుద్ధిప్రచోదనం ఇచ్చి మనకి ఎక్కడా పాదములలో కత్తులు
గుచ్చుకోకుండా, బావిలోనూ పడిపోకుండా మన మనసు/కర్మలు పాపపంకిలం అవకుండా బావి
దాటగలిగే శక్తినీ, మనోబలాన్ని ఇచ్చి, మనచేత విహిత కర్మాచరణ సత్కర్మలు/పుణ్యకర్మలు చేయించి,
ఇహము నందు సుఖాన్ని పరము నందు పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యాన్ని కటాక్షించాలని
కోరుకుందాము !!
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
Manchivishayam..
రిప్లయితొలగించండిChants vaadamulu..