24, డిసెంబర్ 2012, సోమవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీఆర్యాద్విశతి - మొత్తం రెండు శతకములు

ఓం శ్రీశారదాయై నమః

 ఓం శ్రీ గురుభ్యో నమః
శ్రీ కామాక్షీ ఏకాంబరేశ్వరుల నిర్హేతుక కృపా కటాక్షముల వలన,  గత కొద్ది నెలలుగా పది భాగాలుగా తెలుగు లిపిలో వ్రాస్తున్న "భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీఆర్యాద్విశతి" మొత్తం భాగాలు పూర్తి అయ్యాయి. ఇందులోని మొత్తం రెండు శతకాలు (200 శ్లోకాలు) కలిపి ప్రింట్ తీసుకుని పారాయణ చేయడానికి వీలుగా ఒకే PDF పుస్తకంగా చేసి ఈ క్రింద లంకెలో పొందుపరిచాను. కావలసిన వారు ఈ లంకె లోకి వెళ్ళి దానిని ప్రింట్ తీసుకోవచ్చు. 


 భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీఆర్యాద్విశతి - తెలుగు లిపి
 
అమ్మ అనుగ్రహంతో ఆర్యాద్విశతి తెలుగులిపిలో వ్రాయడానికి సంకల్పించి, వ్రాయడం మొదలు పెట్టినప్పటి నుండి, నిరంతరం ప్రోత్సహిస్తూ, నాకు ఆశీస్సులు, అభినందనలు అందించిన పెద్దలందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


ఈ జత చేసిన లిపిలో ఏమైనా అక్షర దోషములు ఉంటే, పెద్దలు తెలియజేయగలరు.

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు


2 కామెంట్‌లు:

  1. శ్రీ మోహన్ కిశోర్ గారికి,

    ఆర్య ద్విశతి మాకు తెలుగులో అందించినదుకు చాల కృతజ్ఞతలు. ఈ స్తోత్రం కి భావార్ధము ఎక్కడైనా దొరుకుతుండో తెలియజేయగలరు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    సుజాత

    రిప్లయితొలగించండి
  2. అమ్మా సుజాత గారూ,

    ధన్యవాదములు తల్లీ! అమ్మవారు నా యందు అనుగ్రహించడం వల్లనే ఇది సాధ్యపడింది. మనందరికీ ఆ కామాక్షీ ఏకాంబరేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం లభించుగాక, అందరమూ ఈ ఆర్యా ద్విశతి పారాయణ చేసి తరిద్దాము.

    రిప్లయితొలగించండి