శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఆరవది తిరుత్తణి. ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరువళ్లూర్ జిల్లాలో అరక్కోణం సమీపంలో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం మన తిరుపతి కి కూడా కేవలం అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన “ ఆరు పడై వీడు ” లో మకుటాయమానమైన క్షేత్రం తిరుత్తణి. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖములు చేకూరుతాయని ప్రసిద్ధి. సుబ్రహ్మణ్య స్వామి వారు అసురు సంహారం చేసిన తర్వాత ఇక్కడే మొట్ట మొదట పూర్తి ప్రశాంతత పొందారు. ఇక్కడ స్వామి వారిని “తనికేశన్” గా కొలుస్తారు. ఈ క్షేత్రములో ఏ భక్తులైతే ఏకాగ్ర చిత్తము, ధృఢ విశ్వాసములతో స్వామి ని ప్రార్ధిస్తారో వారికి క్షణ కాలంలోనే కోరికలు తీరుతాయి అని ప్రతీక. అందువలననే స్వామి వారు కొలువు ఉన్న కొండని “ క్షణికాచలం “ (తమిళం లో తనికాచలం) అని పిలుస్తారు.
ఈ క్షేత్రమునకు దగ్గరలో వల్లి మలై ఉంది. అక్కడి నుంచే వల్లి అమ్మని తెచ్చి ఈ క్షేత్రములో వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణము జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ క్షేత్రములో వీరమూర్తి, జ్ఞాన మూర్తి, ఆచార్య మూర్తి అనే నామములతో కొలుస్తారు.
ఈ క్షేత్రములో ఉన్న వినాయకుడిని “ ఆపత్ సహాయ వినాయగర్ “ అని పిలుస్తారు. ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడి అగ్రజుడు కదా మన లంబోదరుడు, ఆయన తమ్ముడిని వల్లి అమ్మకి ఇచ్చి వివాహం చేయడంలో కీలక పాత్ర వహించారు గణపతి.
ఇక్కడ క్షేత్రములో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ, దేవసేనా, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో చేసినది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు, స్వామి వారు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాల తో కూడా స్వామి వారిని అలంకరిస్తారు.
శరవణ తటాకము |
ఈ క్షేత్రమునకే అనేక పేర్లు కలవు. పూర్ణగిరి, క్షణికాచలం, మూలాద్రి, నీలోత్పల మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం ఉన్న కొండ ఎక్కాలంటే మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి. ఇవి సంవత్సరములో ప్రతీ రోజుకు సంకేతము. ముందుగా స్వామి వారి దగ్గరకి వెళ్ళేటప్పుడు, కొండ క్రింద భాగములో కుమార తీర్థము ఉంటుంది. దీనినే శరవణ తటాకము ( తమిళం లో శరవణ పోఇగై ) అంటారు.
మేము ఈ సంవత్సరం మాఘ మాసం లో ఈ క్షేత్రమునకు వెళ్ళినప్పుడు, ఆలయం అంతా కుంభాభిషేకం సన్నాహాలతో ముస్తాబై ఉంది. మేము వెళ్ళిన మరునాడే కుంభాభిషేకం కావడం మూలాన, ఆ రోజు మాకు స్వామి వారి యొక్క మూల స్వరూప దర్శనము కాలేదు. కాని అక్కడి అర్చక స్వాములు చెప్పారు, ప్రస్తుతం గర్భ లోడిలో స్వామి వారు లేరు, ఆలయం యొక్క ఉత్సవ మూర్తులలో ఆవాహన చేయబడి ఉన్నారు. కాబట్టి బయట ఉన్న స్వామి యే అసలు స్వరూపంగా భావించండి అన్నారు. మళ్ళీ మా స్వామి ఆయన దివ్య మంగళ స్వరూపమును మాకు త్వరలో దర్శనము ఇవ్వాలని కోరుతున్నాను.
కుంభాభిషేక సన్నాహాలు |
తిరుత్తణి క్షేత్ర స్థల పురాణము:
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వల్లి అమ్మ వారి కళ్యాణం తర్వాత, అమ్మ వారు స్వామి వారిని ఈ తిరుత్తణి క్షేత్ర మాహాత్మ్యము గురించి తెలుపమని కోరగా, ఎవరైతే ఈ తిరుత్తణి క్షేత్రములో త్రికరణశుద్ధిగా ఐదు రోజులు స్వామి వారిని ఆరాధిస్తారో, వారికి ఇహలోకములో కావలసిన వన్నీ సమకూర్చి, పరలోకం లో మోక్షప్రాప్తి కలుగజేస్తానని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి అమ్మ వారితో సెలవిచ్చారు.
త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.
ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).
చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన, మన ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి, ఆయన సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతారు. ఇక్కడ తిరుత్తణి లో ఉన్న బ్రహ్మ తీర్థము లో కార్తికేయుని పూజించి, ఆయన తిరిగి ఆయన శక్తి సామర్ధ్యములను పొందారు.
దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే, ఇంద్ర తీర్థములో, “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతీ రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న “ సంఘనీతి, పద్మనీతి, చింతామణి ” మొదలగు దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.
అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రమును మథనం చేయడానికి వాసుకిని తాడుగా చేసి మథనం చేస్తారు. దాని వలన, అక్కడ వాసుకి శరీరమునకు కలిగిన తీవ్రమైన గాయములు ఈ క్షేత్ర దర్శనము తర్వాత పూర్తిగా నయమౌతాయి. ఈ తిరుత్తణి లోనే, అగస్త్య మహా ముని సుబ్రహ్మణ్యుని ఆరాధించిన తర్వాత తమిళ భాష ఆవిర్భవించినది.
పురాణములలోనే కాకుండా, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తుడు అరుణగిరినాథర్ ఈ క్షేత్ర మాహాత్మ్యమును ఎంతగానో కీర్తించారు. ఈ కొండ మీదనే ఎంతో మంది ఋషులు దేవతలు తపస్సు చేయడానికి ఇష్టపడతారని, ఇది భూలోకంలోని శివలోకముగా పోల్చారు.
ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి అవతారముగా కీర్తించబడినవారు, మహానుభావుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారికి ఈ క్షేత్రములోనే స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వారికి తన యొక్క ప్రసాదం ఇచ్చి వెళ్లారు. అప్పటి నుంచే ముత్తుస్వామి దీక్షితార్ కి అనర్గళమైన కీర్తనలు వారి నోటి నుండి వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితం గురించి వ్రాయాలంటే, చాలా పెద్దగా అవుతుంది. ఇది వేరే టపాలో వ్రాద్దామని ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించట్లేదు.
తిరుత్తణి తమిళనాడు లోని కుంభకోణం నుంచి తంజావూర్ వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్ ద్వారా: చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం )నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన APSRTC కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది.రైలు ద్వారా: దీనికి దగ్గరలోని రైల్వే స్టేషన్ అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణి కి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి. వీటి సమయములు ఈ క్రింద ఇస్తున్నాను.
Trains between Chennai Beach Jn and Tiruttani
|
P | MAS | 22.50 | TRT | 00.24 | 01.34 | | Y | Y | Y | Y | Y | Y | Y | | x | x | x | x | x | |||||
P | MAS | 11.55 | TRT | 13.09 | 01.14 | | Y | Y | Y | Y | Y | Y | Y | | x | x | x | x | x | |||||
MAS | 13.50 | TRT | 15.08 | 01.18 | | Y | Y | Y | Y | Y | Y | Y | | x | x | x | x | x | x | |||||
MAS | 06.25 | TRT | 07.47 | 01.22 | | Y | Y | Y | Y | Y | Y | Y | | x | x | x | x | x | x | |||||
MAS | 16.35 | TRT | 17.59 | 01.24 | | Y | Y | Y | Y | Y | Y | Y | | x | x | x | x | x | x | |||||
MS | 17.00 | TRT | 18.29 | 01.29 | | Y | Y | Y | Y | Y | Y | Y | | x | x | x | x | x | ||||||
MAS | 04.00 | TRT | 06.15 | 02.15 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 07.15 | TRT | 09.30 | 02.15 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 10.00 | TRT | 12.20 | 02.20 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 11.45 | TRT | 14.00 | 02.15 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 14.20 | TRT | 16.35 | 02.15 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 15.30 | TRT | 17.55 | 02.25 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 17.35 | TRT | 20.00 | 02.25 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 19.00 | TRT | 21.20 | 02.20 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 20.15 | TRT | 22.40 | 02.25 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MSB | 12.10 | TRT | 14.40 | 02.30 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MSB | 18.20 | TRT | 20.25 | 02.05 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | | |||
MAS | 07.05 | TRT | 09.09 | 02.04 | Y | Y | Y | Y | Y | Y | x | | | Un | Re | se | rv | ed | | | ||||
MAS | 19.10 | TRT | 20.48 | 01.38 | | Y | Y | Y | Y | Y | Y | Y | | | Un | Re | se | rv | ed | | |
విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు చెన్నై ( 82 Km ), తిరుపతి ( 60 Km ) దూరంలో ఉన్నాయి.
ఇక్కడ స్వామి వారి కొండ క్రిందనే దేవస్థానము వసతి గృహాలు ఉన్నాయి. చాలా చక్కగా, తిరుమలలో లాగా ఉంటాయి. ఇక్కడకి వెళ్ళే ముందు ఆలయం వారికి డీడీ రూపములో డబ్బు పంపవలెను. కాని, రద్దీ తక్కువగా ఉండే సమయములో అప్పటికప్పుడు కూడా వసతి ఇక్కడ దొరుకుతుంది. దేవస్థానము వారి కాతీజీల వివరములు ఇవి...
Devasthanam Cottages and Rooms are available for the convenient stay of devotees.
Kannikai Details | ||||
Cottages Details | In Numbers | Ordinary Days Kannikai | Festival Days Kannikkai | Deposit Amount |
Air condition cottages | 57 | Rs. 1000 /- | Rs. 1500/- | Rs. 1000 /- |
Non Air condition cottages | 34 | Rs.600 /- | Rs. 900/- | Rs.600 /- |
Big Rooms | 6 | Rs. 300 /- | Rs.450 /- | Rs. 300 /- |
Ordinary Rooms | 146 | Rs.200 /- | Rs.300/- | Rs.200 /- |
ఆలయంలో ఆర్జిత సేవలు:
Poojas Details | |||
The Various Poojas mentioned below are performed as prescribed in Kamikagamam, Karanakagamam, Supravedagarnam and Kumara Thanthiram. | |||
1. Visawaroopa Dharshan 2. Kalaisanthi Abishegam 3. Utchikalai Abishegam 4. Sayaraktcha Abishegam 5. Arthajama Pooja 6. Palliyarai Pooja | 6.00 AM 8.00 AM 12.00 PM 5.00 PM 8.00 PM 9.00 PM |
| |
ARJITHA SEVA OR UBHAYA POOJAS | |||
Name of Pooja and utchavam | సేవ యొక్క ధర | ||
1. Panchamirtha Abishegam (Panchamirtha is made by mixing with various fresh fruits, jaggery, honey etc.,) | RS.600.00 /- | ||
2. To Adorn Tanga Kavasam (Golden Jacket) | RS.250.00 /- | ||
3. Sahasranama Archana – Praising the Lords Name thousand times | RS.200.00 /- | ||
4 . Sandal Paste decoration | RS.3251.00 /- | ||
5. Viboothi, Panneer, Milk, Curd, Sandal in liquied form, tender coconut water abishegam (for each one) | RS.30.00 /- | ||
6 . Golden Chariot | RS.1250.00 /- | ||
7 . Silver Chariot | RS.2200.00 /- | ||
8. Silver Peacock and other Vahanams for each one | RS.2000.00 /- | ||
9. Kedaya Utchavam | RS.500.00 /- | ||
10. Kalyana Utchavam | RS.1100.00 /- | ||
11 . Krithigai Archanai for one year | RS.450.00 /- | ||
12 . Annadhanam one day (200 members) | RS.2500.00 | ||
13. Annadhanam Kattalai | RS.25000.00 /- |
క్షేత్రము యొక్క చిరునామా:
Joint Commissioner/ Executive Officer,
Arulmigu Subramanyaswamy Temple,
Tiruttani – 631 209.
Tiruttani – 631 209.
· Hill Temple Tel Number : 044-27885243
· Temple office Tel Number: 044-27885247
· Cottages- Thanigai Illam: 044-27885387
· Karthikeyan Cottages: 044-27885396
క్షేత్రము యొక్క వెబ్ సైట్:
http://www.tirutanigaimurugan.org/index.php?&vt=2
http://murugan.org/temples/tiruttani.htm
తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి వ్రాసిన ఈ టపాలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.
ఈ టపాతో, “ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు “ అనే శీర్షికన వ్రాస్తున్న క్షేత్రముల వివరములు స్వామి వారు పూర్తి చేయించారు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కృప అందరికీ కలగాలని, ప్రతీ ఒక్కరూ, ఈ ఆరు పడై వీడు అనే సుబ్రహ్మణ్యుణి ఆరు ముఖములుగా కీర్తించబడిన ఈ క్షేత్రముల దర్శనము చేసుకొని స్వామి యొక్క అనుగ్రహమును అందరూ పొందాలని సుబ్రహ్మణ్యుడిని ప్రార్ధిస్తూ........
మోహన్ కిషోర్ గారు మంచి నీళ్ళ కోసం వెతుకున్న నాకు అమృతం లభించినట్టు ఉంది మీ బ్లాగ్ చూస్తుంటే . చాల చక్కగా కాదు అద్భుతంగా రాసారు అండి .
రిప్లయితొలగించండిధన్యవాదములండీ రాజాచంద్ర గారు, మీరు తిరుత్తణి క్షేత్ర దర్శనానికి వెళ్ళబోతున్నారు కదా, అక్కడి నుంచి వచ్చాక, మీ అనుభవాలు కూడా పంచుకోగలరు.
రిప్లయితొలగించండిధన్యవాదములండీ మోహన్ కిషోర్ గారు అద్భుతంగా రాసారు
రిప్లయితొలగించండి