15, ఆగస్టు 2012, బుధవారం

యజుర్వేదాంతర్గత ఘోష శాంతి మంత్ర పాఠము

శ్రీ గురుభ్యో నమః

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 


ఋషి సమానుడు అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు (వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనే పద్యంలో) అడిగినట్లుగా, మన దేశమునకు నిజమైన స్వాతంత్ర్యము త్వరలోనే రావాలని, మనలోనూ, బయటా ఉన్న ఆసురీ శక్తులు నశించాలనీ, మళ్ళీ శ్రీరామ రాజ్యంలోలాగా, అందరూ ధర్మ బధ్ధముగా, శాంతి సౌఖ్యాలతో బ్రతకాలనీ ఆశిస్తూ..... యుజుర్వేదాంతర్గత ఘోష శాంతి మంత్ర పాఠము(సుస్వర) ఈ క్రింద లంకెలో PDF ఫైల్ గా జత చేస్తున్నాను.


అందరమూ ఈ శాంతి మంత్రములను విని, చదివి.... మనకీ, మన కుటుంబాలకీ, మన దేశానికీ..... యావత్ మానవాళికీ శాంతి కలగాలని ప్రార్ధిర్ధాం...

II పృథివీ శాంతిః అంతరిక్షగ్ం శాంతిః ద్యౌశ్శాంతిః దిశా శాంతిః అంతర్దిశా శాంతిః అగ్ని శాంతిః వాయుః శాంతిః ఆదిత్యః శాంతిః చంద్రమా శాంతిః నక్షత్రాణి శాంతిః ఆపః శాంతిః ఓషధయశ్శాంతిః వనస్పతయశ్శాంతిః గో శాంతిః అజా శాంతిః అశ్వః శాంతిః పురుషః శాంతిః బ్రహ్మ శాంతిః బ్రాహ్మణః శాంతిః శాంతి రేవ శాంతిః శాంతి ర్మే అస్తు శాంతిః II

ఓం శాంతిః శాంతిః శాంతిః


II సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు II

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి