II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 4వ భాగము II
(శ్రీ లలితాస్తవరత్నమ్)
పవమాన సఙ్ఖ్య
యోజన దూరే బాలతృణ మేచక స్తస్య I
సాలో మరకత్ రచిత
స్సంపద మచలాం శ్రియం చ పుష్ణాతు II 61 II
ఆవృతి యుగ్మాన్తరతో
హరితమణీ నివహ మేచకే దేశే I
హాటక తాలీవిపినం
హాలాఘట ఘటిత విటప మాకలయే II 62 II
తత్రైవ మన్త్రిణీగృహ
పరిణాహం తరళకేతనం సదనమ్ I
మరకతసౌధ మనోజ్ఞం
దద్యా దాయూంషి దండనాథాయాః II 63 II
సదనే తత్ర హరిన్మణి
సఙ్ఘటితే మణ్టపే శత స్తమ్భే I
కా ర్తస్వర మయ పీఠే
కనకమయామ్బురుహ కర్ణికా మధ్యే II 64 II
బిన్దు-త్రికోణ-వర్తుల-
షడ్దళ-వృత్తద్వయాన్వితే చక్రే I
సఞ్చారిణీ దశో త్తర
శతార్ద మనురాజ కమల కలహంసీ II 65 II
కోల వదనా కుశేశ య
నయనా కోకారి మణ్డిత కిరీటా I
సన్తప్త కాఞ్చినాభా
సన్ధ్యారుణ చేల సంవృత నితమ్బా II 66 II
హల-ముసల-శఙ్ఖ-చక్రాఙ్కుశ-
పాశాయుధ స్ఫురిత హస్తా I
కూలఙ్కష కుచకుమ్భా
కుఙ్కుమజమ్బాలిత స్తనాభోగా II 67 II
ధూర్తానా మతిదూరా
వార్తా శేషావలగ్న కమనీయా I
ఆర్తాళీ శుభధాత్రీ
వార్తాళీ భవతు వాఞ్ఛితార్థాయ II 68 II
తస్యాః పరితో దేవీః
స్వప్నే శ్యున్మత్త భైరవీ ముఖ్యాః I
ప్రణమత జమ్భిన్యాద్యా
భైరవవర్గాంశ్చ హైతుక ప్రముఖాన్ II 69 II
పూర్వోక్త సఙ్ఖ్య యోజన
దూరే పూషాంశు పాటల స్తస్య I
విద్రావయతు మదార్తిం
విద్రుమసాలో విసఙ్కటద్వారః II 70 II
ఆవరణయో రహర్నిశ
మన్తర భూమౌ ప్రకాశ శాలిన్యామ్ I
ఆసీన మమ్బుజాసన
మభినవ సిన్దూర గౌర మహ మీడే II 71 II
వరణస్య తస్య మారుతి
యోజనతో విపుల గోపుర ద్వారః I
సాలో నానారత్నై
స్సఙ్ఘటితాఙ్గః కృషీష్ట మదభీష్టమ్ II 72 II
అన్తర కక్ష్యా మనయో
రవిదళ శోభా పిచణ్డిలోద్దేశామ్ I
మాణిక్య మణ్డపాఖ్యాం
మహతీ మధిహృదయ మనిశ మాకలయే II 73 II
తత్ర స్థితం ప్రసన్నం
తరుణ తమాల ప్రవాళ కిరణాభమ్ I
కర్ణావలమ్బి కుణ్డల
కన్దళితాభీశు కవచిత కపోలమ్ II 74 II
శోణాధరం శుచిస్మిత
మేణాఙ్క నిభాస్య మేధమాసకృపమ్ I
ముగ్ధైణమద విశేషక
ముద్రిత నిటలేన్దు రేఖికా రుచిరమ్ II 75 II
నాళీక దళ సహోదర
నయనాఞ్చల నటిత మనసిజాకూతమ్ I
కమలా కఠిన పయోధర
కస్తూరీ ఘుసృణ పఙ్కిలోరస్కమ్ II 76 II
చామ్పేయ గన్ధికైశ్యం –
శమ్పా సబ్రహ్మచారి కౌశేయమ్ I
శ్రీవత్స కౌస్తుభ ధరం
శ్రితజన రక్షా ధురీణ చరణాబ్జమ్ II 77 II
శమ్బు సుదర్శన విలసత్
కరపద్మం కణ్ఠ లోల వనమాలమ్ I
ముచుకున్ద మోక్షఫలదం
ముకున్ద మానన్ద కన్ద మాలమ్బే II 78 II
తద్వరణో త్తర భాగే
తారాపతి బిమ్బ చుమ్బి నిజ శృఙ్గః I
వివిధమణీ గణ ఖచితో
వితరతు సాలో వినిర్మలాం ధిషణామ్ II 79 II
ప్రాకార ద్వితీయా న్తర
కష్యాం-పృథు రత్న నికర సమ్పూర్ణామ్ I
నమత సహస్ర స్తమ్భక
మణ్టప నామ్నాతి విశ్రుతాం భువనే II 80 II
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు