"శాస్త్రం చెప్పిన వైదిక కర్మలు చేయడానికి అమితమైన డబ్బు అవసరం లేదు, అలాగే పూజ చేయడానికి పెద్ద హంగులు, ఆర్భాటమూ కూడా అవసరం లేదు. కేవలం ఎండిపోయిన తులసి ఆకులు, మారేడు దళాలు నాలుగు ఉన్నా, పూజ చేయవచ్చు. మనం రోజూ తినడానికి వండుకునే అన్నమే నైవేద్యంగా నివేదించవచ్చు.
'ఈ రోజుల్లో వివాహం అనగానే చాలా చాలా డబ్బు దాని కొఱకు వెచ్చిస్తున్నారు కదా
దీని మీద మీ అభిప్రాయం ఏమిటి' అని కొందరడిగారు. దానికి నా సమాధానం -
'శాస్త్రం ప్రకారం వివాహము కూడా ఒక వైదికమైన క్రతువు. ఇప్పుడు మనం
చూస్తున్నట్లుగా, వివాహము అమితమైన వ్యయంతో కూడుకుని చేయమని మన ఏ
శాస్త్రాలలో కూడా చెప్పలేదు. అనగా వివాహం పేరు మీద అంతంత డబ్బు ఖర్చు
చేయడానికి శాస్త్రం అంగీకరించలేదు. అందునా ప్రత్యేకంగా వివాహ క్రతువులో,
కట్నం తీసుకోవడం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధము, మన శాస్త్రాలు కట్నం
తీసుకోవడాన్ని అంగీకరించలేదు".
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
పరమాచార్య వాణిని కూడా వినేలా లేరు. ధనమూల మిదంజగత్!
రిప్లయితొలగించండి