2, జనవరి 2013, బుధవారం

అరుణాచల అక్షరమణమాలభగవాన్ రమణ మహర్షి స్వయముగా చేసిన అరుణాచలేశ్వరుని స్తుతి ఈ "అరుణాచల అక్షరమణమాల". భగవాన్ ఒకరోజు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆసువుగా, ఆయన నోటి ఉండి వచ్చిన అరుణాచలేశ్వరుని స్తుతి. భగవాన్ రమణులు చేసిన ఈ స్తుతిని అక్షరమణమాలై అని అంటారు, అది తమిళంలో ఉంటుంది. కానీ శ్రీరమణాశ్రమం వారు, భగవాన్ ఇచ్చిన ఈ అద్భుతమైన స్తుతిని తెలుగులో అనువదింపజేశారు. ఈశ్వరుని నిర్హేతుక కృప వలన, పూజ్య గురువు గారి ఆశీస్సుల ఫలముగా, మాకు అరుణాచలేశ్వరుని, రమణాశ్రమమును దర్శించుకునే భాగ్యం కలిగినది. అప్పుడు రమణాశ్రమములో ఈ అరుణాచల-అక్షరమణమాల తెలుగు పుస్తకము లభించినది.  ఈ స్తోత్రం యొక్క తెలుగు లిపి, అంతర్జాలములో కూడా ఉంటే బావుంటుంది అనే చిన్న కోరికయే ఈ ప్రయత్నానికి కారణం. ఇందులో ఏమైనా అక్షర దోషములు ఉంటే, అరుణాచలేశ్వరుడు నన్ను క్షమించుగాక.


అరుణాచలశివ  - అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా
                          అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా ।।

పూర్తి శ్లోకము కావలసిన వారు ఈ క్రింద లంకెలో PDF రూపములో ఉన్న ప్రతిని దింపుకుని పారాయణ చేయవచ్చు.
ఈ అరుణాచల అక్షరమనమాల తెలుగులో గానం చేయబడిన mp3 ఈ క్రింద లంకె నుండి దింపుకోగలరు.
@ శ్రీరమణాశ్రమము వారి సౌజన్యముతో
ఓం అరుణాచలేశ్వరాయ నమః
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

1 వ్యాఖ్య: