అంబే నారాయణీ..... దుర్గే నారయణీ నమో నమః |
ఇన్దుమయ సాల మీడే
తస్యోత్తరత స్తుషార గిరి గౌరమ్ I
అత్యన్త శిశిర మారుత
మనయోర్మధ్యం చ చన్ద్రికోద్గారమ్ II 101 II
తత్ర ప్రకాశమానం
తారానికరైః పరిష్కృతం సేవ్యమ్ I
అమృతమయ కాన్తి కన్దళ
మన్తః కలయామి కున్దసిత మిన్దుమ్ II 102 II
శృఙ్గారసాల మీడే
శృఙ్గోల్లసితం తదుత్తరే దేశే I
మద్యస్థలే తయోరపి
మహితాం శృఙ్గార పూర్వికాం పరిఘామ్ II 103
II
తత్ర మణిసౌ స్థితాభి
స్తవనీయారచిత శారి హస్తాభిః I
శృఙ్గార దేవతాభి
స్సహితం పరిఘాధిపం భజే మదనమ్ II 104 II
శృఙ్గార వరణ వర్య
స్యోత్తరత స్సకల విబుధ సంసేవ్యమ్ I
చిన్తామణి గణ రచితం
చిన్తాం దూరీ కరోతు మే సదనమ్ II 105 II
మణిసదన సాలయో
రధిమధ్యం దశతాళ భూమిరుహ దీర్ఘైః I
పర్ణైః వయోదవర్ణై
ర్యుక్తాం కాండైశ్చ యోజనో త్తుంగైః II 106
II
మృదుళై స్తాళీపఞ్చక
మానై ర్మిళితాం ద్వియోజనోత్తుఙ్గైః I
సన్తత గళిత మరన్ద
స్రోతో నిర్యన్మిళిన్ద సన్దోహామ్ II 107
II
సన్తత గళిత మరన్ద
స్రోతో నిర్యన్మిళిన్ద సన్దోహమ్ I
కలహంసీ కుల కలకల
కూలఙ్కష నినద నిచయ కమనీయామ్ II 108 II
పాటీర పవన బాలక
ధాటీ నిర్యత్పరాగ పిఞ్జరితామ్ I
పద్మాటవీం భజామః
పరిమళ కల్లోల పక్ష్మలోపాన్తామ్ II 109 II
దేవ్యర్ఘ్య పాత్రధారీ
తస్యాః పూర్వదిశి దశ లాయుక్తః I
వలయిత మూర్తిర్ భగవాన్
వహ్నిః క్రోశోన్నత శ్చిరం జీయాత్ II 110
II
తత్రధారే దీవ్యన్
ప్రాత్రీభూతః ప్రభాకర శ్శ్రీమాన్ I
ద్వాదశ కళాసమేతో
ధ్వాన్తం మమ బహుళ మాన్తరం భిన్ద్యాత్ II
111 II
తస్మిన్ దినేశపాత్రే
తరఙ్గితామోద మమృతమయ మర్ఘ్యమ్ I
చన్ద్రకళత్మక మమృతం
సాన్ద్రీకుర్యాదమన్ద మానన్దమ్ II 112 II
అమృతే తస్మిన్నభితో
విహరస్త్యో వివిధ మణితరణి భాజః I
షోడశకళా స్సుధాంశో
శ్శోకా దుత్తారయన్తు మా మనిశమ్ II 113 II
తత్రైవ విహృతిభాజో
ధాతృముఖేశానాం చ కారణేశానామ్ I
సృష్ట్యాది రూపికాన్తా
శ్శమయ న్త్వఖిలాః కలా శ్చ సన్తాపమ్ II 114
II
కీనాశ-వరుణ-కిన్నర
రాజ దిగన్తేషు రత్న గేహస్య I
కలయామి తాన్యజస్రం-
కలయ న్త్యాయుష్య మర్ఘ్యపాత్రాణి II 115 II
పాత్ర స్థలస్య పురతః
పద్మారమణ విధి పార్వతీశానామ్ I
భవనాని శర్మణే వో
భవన్తి భాసా ప్రదీపిత జగన్తి II 116 II
సదనస్యానలకోణే
సతతం ప్రణమా కుణ్డమాగ్నేయమ్ I
తత్ర స్థితం చ వహ్నిం
తరళశిఖా జటిల మమ్బికాజనకమ్ II 117 II
తస్యాశరదిశి తాదృశ
రత్న పరిస్ఫురిత పర్వనవకాఢ్యమ్ I
చక్రాత్మకం శాతాఙ్గం
దశయోజన ముత్తుఙ్గం భజే దివ్యమ్ II 118 II
తత్త్రైవ దిశి నిషణ్ణం
తపనీయ ధ్వజ పరమ్పరాశ్లిష్టమ్ I
రథ మపరఞ్చ భవాన్యా
రచయామో మనసి రత్నమయ చూడమ్ II 119 II
భువనస్య వాయుభాగే
పరిష్కృతో వివిధ వైజయ న్తీభిః I
రచయతు ముదం రథేన్ద్ర
స్సచివేశాన్యా స్సమస్త వన్ద్యాయాః II 120
II
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు