22, ఆగస్టు 2011, సోమవారం

స్కంద షష్ఠి కవచం





శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ చేసిన అనేకమైన స్తోత్రములలో, కీర్తనలలో బాగా ప్రాశస్త్యం పొందిన స్తోత్రం స్కంద షష్ఠి కవచం. ఈ కవచం తమిళ నాట చాలా చాలా ప్రసిద్ధి పొందిన స్తోత్రము. ఈ కవచమును వ్రాసిన వారు శ్రీ దేవరాయ స్వామి వారు.  ఈ స్కంద షష్ఠి కవచమును ప్రతీ సంవత్సరము స్కంద షష్ఠి ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేకించి చదువుతారు. ఈ స్కంద షష్ఠి అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది. 

ఈ కవచమును శ్రద్ధతో ప్రతీ రోజూ పఠించిన భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహము లభిస్తుంది, ఆ షణ్ముఖుని శక్తి ఆయుధము మనకు ఒక కవచమై ఎల్లప్పుడూ రక్షిస్తుంది, అంతేకాక సర్వ వ్యాధి నివారణ, ఐశ్వర్య ప్రాప్తి, చేసే పనులలో విజయం కలగడం, సర్వ గ్రహ, శత్రు, కలి బాధలు హరిమ్పబడతాయి, ఎటువంటి భూత ప్రేతములు దరి చేరలేవు, ఇహములో ఎన్నో సౌఖ్యములను కలుగజేసి, చివరకు స్కంద సాయుజ్యమును కలుగ చేయగల స్తోత్రం ఈ స్కంద షష్ఠి కవచం. ఈ కవచం పఠించిన వాళ్లకి అన్నిటా విజయం లభిస్తుంది. 

ప్రత్యేకించి తమిళనాట ఎంతో మంది మహా భక్తులు ఈ కవచం యొక్క అద్భుత ఫలితములను అనుభవించారు. జీవితములో తీరని సమస్యలు, కోరికలు (ధర్మబద్ధమైనవి) నెరవేరుతాయి, సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, దీనిని నమ్మి పఠించిన వారి ఇల్లు సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. మనం ఈ జన్మలోనూ, పూర్వ జన్మలలోనూ తెలిసీ, తెలియక అనేక పాపములు చేసి ఉంటే, వాటి ఫలితములను ఘోర రూపములో అనుభవించవలసి ఉంటే, ఈ స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల, షణ్ముఖ కటాక్షం కలిగి, మనకు కవచమై, మనల్ని రక్షించగలదు. 

స్కంద షష్ఠి కవచం తిరుచెందూర్ లో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని ఉద్దేశించి వ్రాశారు శ్రీ దేవరాయ స్వామివారు. తమిళనాడులో బాగా ప్రసిద్ధి చెందిన ఆరు పడై వీడు (ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు) లో ఈ తిరుచెందూర్ ఒక దివ్య క్షేత్రము. ఈ తిరుచెందూర్ క్షేత్రం తిరునల్వేలి జిల్లాలో, సముద్ర తీరములో ఉన్న ఒక అద్భుతమైన ఆలయం. ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రముల యొక్క వివరములను రాబోయే టపాలో చర్చిస్తాను. 

రచయిత గురించి:
శ్రీ దేవరాయ స్వామి వారి స్వగ్రామం తమిళనాడు లోని వళ్ళూరు. వీరి తండ్రి గారి పేరు శ్రీ వీరాస్వామి పిళ్ళై. వీరు వళ్ళూరులోనే  అక్కౌంటెంట్'గా పనిచేసేవారు. వారికి చాలా కాలం సంతానం లేదు, చాలా కాలం తరువాత వారికి ఒక మగ బిడ్డ జన్మించాడు, ఈతనికి “దేవరాయన్” అనే పేరు పెట్టారు. ఈయనకి చిన్ననాటి నుండి తమిళ భాష మీద చాలా మక్కువ ఉండేది. ప్రాధమిక విద్యాభ్యాసం తర్వాత ఉన్నత కళలు అభ్యసించడానికి వీరు ఇరవైయేళ్ళ వయసులో బెంగళూరు పట్టణం చేరుకున్నారు. అదే సమయంలో త్రిశిరాపురం మహా విద్వాన్ శ్రీమీనాక్షిసుందరంపిళ్ళై అనే పండితుడు బెంగళూరు వచ్చారు. అప్పట్లో ఎంతో మంది విద్యార్థులు, పండితులు సైతం తమిళ భాషను అభ్యసించడానికి వీరి వద్దకు వచ్చేవారు. శ్రీ దేవరాయ స్వామి వారు శ్రీ పిళ్ళై వారిని కలిసి తమిళ భాష నేర్చుకోవాలని ఉందని, తనకి నేర్పమని అభ్యర్ధించారు. వీరికి విద్య నేర్పడానికి శ్రీ పిళ్ళై విద్వాన్ అంగీకరించారు. శ్రీ పిళ్ళై తమిళ భాషా సాహిత్యములో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఇదే బాణీలో దేవరాయ స్వామి వారికి కూడా, పద్యాలు వ్రాయడం మీద మక్కువ పెరగడంతో, శ్రీ పిళ్ళై గారు వీరికి పద్యములు వ్రాయడానికి అవసరమైన వ్యాకరణము (దీనిని తమిళంలో యాపరుంగలక్ కారికై అని అంటారు) కూడా నేర్పించారు. ఈ విధంగా శ్రీ దేవరాయ స్వామి వారు చాలా కొద్ది కాలంలోనే తమిళ భాషా సాహిత్యం మీద పాండిత్యం సంపాదించారు.
ఒక సారి దేవరాయన్ వారికి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. ఆయన ఎంత మంది వైద్యులను సంప్రదించినా నయం కాలేదు. ఇంక మామూలు వైద్యములకు తగ్గదని నిశ్చయించుకుని, కేవలం భగవంతుడి కృప వలన తగ్గాలి  అని, సెంథిల్ మురుగన్ మందిరమునకు వెళ్లారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహము లభించి ఆయన యొక్క కడుపు నొప్పి తగ్గిపోయింది. ఇక్కడ విశేషము ఏమిటంటే ఆ రోజు స్కంద షష్ఠి ఉత్సవములలో మొదటి రోజు కావడం. కార్తికేయుని యొక్క నిర్హేతుక కృపా కటాక్షములను పొందిన దేవరాయ స్వామి కన్నీటితో ఆనంద పారవశ్యంలో ఆరు కవచములను పాడారు. స్కంద షష్ఠి ఉత్సవాలు జరిగిన ఆరు రోజులలో ఒకో రోజు ఒక కవచం పాడారు. ఈ కవచములను స్తోత్రం చేసిననాటి నుండి వారు స్వామి అనే దీక్షా నామం తీసుకుని శ్రీ దేవరాయ స్వామిగా పిలవబడ్డారు. 

ఈ కవచములలో సకల భువన భాండములకు నాయకుడు, పరబ్రహ్మ స్వరూపమైన శివ గౌరీ సుత సుబ్రహ్మణ్య వైభవం కీర్తించ బడింది.

సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యార్పణ మస్తు.

31, జులై 2011, ఆదివారం

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం



ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీమాత్రే నమః
  

సదాశివ సమారంభాం

శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం

వందే గురు పరంపరాం


1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా I
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II
  
2. నజానామి శబ్దం నజానామి చార్థం
నజానామి పద్యం నజానామి గద్యం I
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II

3. మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం I
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం II

4. యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ I
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II

5. యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే I
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం II

6. గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః I
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు II

7. మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే  సుగంధాఖ్యశైలే I
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం II

8. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే I
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్ II

9. రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే I
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే II

10. సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ I
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ II

11. పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్ I
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్ II

12. విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ I
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ II

13. సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్ I
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ II

14. స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని I
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి II

15. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు I
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః II

16. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్ I
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః II

17. స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః I
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః II

18. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్ I
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ II

19. కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ I
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ II

20. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే I
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ II

21. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు I
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం II

22. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం I
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా II

23. సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః I
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి II

24. అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే I
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ II

25. అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః I
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే II

26. దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ I
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః II

27. మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః I
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే II

28. కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః I
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార II

29. మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే I
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల II

30. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ I
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ II

31. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః I
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు II

32. జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే I
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో II

33. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య I
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః II
 
ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణమ్.